ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు చాలా వేడి వేడిగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు తారాస్థాయి కి చేరుకుంటున్నాయి. మొట్ట మొదటి రోజు నుండి ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఆరోపణలు చేస్తుంటే మరోపక్క అధికార పక్షానికి చెందిన సభ్యులు అదే శైలిలో కౌంటర్లు వేస్తూ అసెంబ్లీని రక్తి కట్టిస్తున్నారు.

 

మొట్ట మొదటి రోజు మహిళా భద్రతా బిల్లు విషయం మరియు అదే విధంగా ఇంకా అనేక విషయాల గురించి అధికార పార్టీకి చెందిన మహిళ ప్రతినిధులు మాట్లాడుతున్న తరుణంలో... తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అడ్డుపడి ఉల్లిపాయ ధరలపై ప్రసంగించాలి అని ముఖ్యమంత్రి జగన్ నీ నిలదీస్తున్న సమయంలో.. జగన్ స్పందిస్తూ ఖచ్చితంగా ఉల్లిపాయ పై చర్చ ఉంటుందని చెప్పినా గాని తెలుగుదేశం శాసనసభ్యులు గందరగోళంగా వ్యవహరించడంతో.. జగన్ సీరియస్ అయి దేశంలో కిలో ఉల్లిపాయలు 25 రూపాయలకు ఇస్తున్న రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే అని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రస్తుతం దేశంలో ఆడవాళ్లపై అత్యాచారాలు మానభంగాలు ఎక్కువ ఉన్న తరుణంలో కీలక సమయంలో మహిళా ప్రతినిధులు మాట్లాడుతున్న తరుణంలో ప్రతిపక్ష సభ్యులు ఈ విధంగా వ్యవహరించడం దారుణం అని జగన్ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం రోజు సీరియస్ అయ్యారు.

 

కాగా బుధవారం రోజు నాడు రాష్ట్రంలో ఏ ఆడపిల్ల పైన అత్యాచారం జరిగితే నిందితులకు శిక్ష విధించడంలో సరికొత్త చట్టాలు తీసుకు రాబోతున్నట్లు జగన్ పేర్కొన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా లో ఆడవాళ్ళ పై అసభ్యంగా పోస్టులు పెట్టే వారిపై కూడా చర్యలు తీసుకునే విధంగా సరికొత్త చట్టాలు తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు జగన్ స్పష్టం చేశారు. దీంతో బుధవారం నాడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో కీలక బిల్లులు రాబోతున్నట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: