భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి. ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న మ‌హేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు.. ఇది ఈయన క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 26వ చిత్రం కాగా సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

 

 

ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క వెంట వెంటనే అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ లో ఇప్పటినుండే జోరు పెంచారు చిత్ర యూనిట్. ఇప్పటికే టీజర్ ను, ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా వాటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే కాకుండా మ‌హేష్ కి జోడీగా ర‌ష్మిక న‌టిస్తుండగా అల‌నాటి లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి ఈ సినిమా ద్వారా రీ-ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఇకపోతే దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు. కాగా, జ‌న‌వ‌రి 11న స‌రిలేరు నీకెవ్వ‌రు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

 

 

మ‌రి ఈ సినిమాతో మహేష్ బాబు మరో హ్యాట్రిక్ అందుకుంటాడేమో చూడాలి. ఇక అనిల్ రావిపూడి ఎఫ్ 2 ఇచ్చిన కిక్ తో మాంచి ఫాం లో ఉన్నాడు. అటూ వెంకటేష్, వరుణ్ కు మంచి హిట్ ఇచ్చినట్లుగా మహేష్ బాబుకు కూడా భారీ విజయాన్ని అందిస్తాడని ప్రిన్స్ అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

 

 

ఇకపోతే ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తుండగా అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ఈ చిత్రాన్ని విడుదలచేయడానికి చిత్ర బృందం సన్నాహలు చేస్తున్నారు. కాగా మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: