ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా గ్లామరేస్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మీ గౌతం సినిమాల మీద కూడా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. తెలుగు చక్కగా మాట్లాడటం, అందంగానూ ఉండటం, మలయాళం హీరోయిన్లతో పోటీ గా ఉండటంతో ఆమెకు అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. అయితే అడపా దడపా మినహా ఆమెకు అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం ఏంటి అనేది తెలియకపోయినా దర్శక నిర్మాతలు మాత్రం ఆమెతో సినిమా చేయడానికి అంత ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

 

ఇటీవల రష్మీ గౌతం కి బాలకృష్ణ తో బోయపాటి నటించే సినిమాలో అవకాశం వచ్చిందని ప్రచారం జరిగింది. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ఓ కీలక పాత్ర ఉందట. గ్లామరస్‌గా కనిపించాల్సిన అవసరం కూడా ఉందట. ఆ పాత్ర కోసం కొందరు రష్మీ అయితే బాగుంటుందని సూచించారట. కాని బోయపాటి మాత్రం రష్మీని వద్దని చెప్పినట్టు ఫిలిం నగర్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల గురించి చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. కాని సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజ్ లో ప్రచారం జరుగుతుంది.

 

దీనిపై కొందరు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రష్మీకి అందం ఉంది, అభినయం ఉంది, తెలుగు భాష మీద మంచి పట్టునది, అభిమానుల్లో ఫాలోయింగ్ ఉంది, నటన కూడా ఉంది... గుంటూరు టాకీస్ తో ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకుంది. కాని ఆమె నటించిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదట. ఆశించిన స్థాయిలో ఆ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయట. అందుకే ఆమెను బోయపాటి వద్దన్నారట. ఇటీవల మరో దర్శకుడు ఆమెను సంప్రదించినా నిర్మాత వద్దని చెప్పారని అంటున్నారు. అన్నీ ఉన్నా సరే రష్మీని బాడ్ లక్ వెనక్కి లాగుతుందని అంటున్నారు. ఏదేమైనా బుల్లి తెర సూప‌ర్ పాపుల‌ర్ యాంక‌ర్‌కు వెండి తెర మీద ఏ మాత్రం ల‌క్ క‌లిసి రావ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: