ఈ రోజుల్లో సినిమా హీరోయిన్లు టాటూలు వేసుకుని కనపడటం కామన్ అయిపోయింది. అభిమానులు వాటిని ఆసక్తిగా చూడటంతో హీరోయిన్లు కూడా వాటి విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు. సామాన్యంగా హీరోయిన్స్ తమకు నచ్చిన భాగంలో టాటూలు వేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎక్కడ అయితే అభిమానుల కన్ను పడాలో అక్కడ టాటూ వేసుకుని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు హీరోయిన్లు. గతంలో చెన్నై బ్యూటీ త్రిష కింగ్ సినిమాలో టాటూతో ఆకట్టుకుంది. ఆమె టాటూ వేసుకున్న ప్రదేశం కోసం చీరను కూడా జాగ్రత్తగా కట్టారు. ఆ తర్వాత బిల్లా సినిమాలో అనుష్క నడుం మీద బిల్లా అని రాసుకున్న టాటూ ఆకట్టుకుంది.

 

ఇలా చాలా మంది హీరోయిన్లు టాటూని కూడా ఒక గ్లామర్ గా చూడటం ఆశ్చర్యంగా మారింది. ఈశా రెబ్బా కూడా ఈ మధ్య టాటూతో కనపడుతుంది. అయితే ఇప్పుడు కొందరు దర్శకులు టాటూ ఉన్న హీరోయిన్లను వద్దు అంటున్నారు అనే ప్రచారం ఎక్కువగా అజరుగుతుంది. దానికి కారణం ఏంటో తెలియదు గాని ఒక హీరోయిన్ విషయంలో ఇటీవల సీరియస్ అయ్యారట. ‘నాటకం’, ‘జెర్సీ’ సినిమాల్లో నటించిన ఆషీమా నర్వాల్‌ తన రెండు తొడల మీద టాటూ వేయించుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

 

ఆమె వాటిని చూపించే విధంగా వస్త్రాలు ధరించింది. దీనిపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతుంది. ఇప్పుడు ఆమెను హీరోయిన్ గా కంటే ఐటెం గర్ల్ గానే దర్శకులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఇటీవల ఒక తమిళ హీరోయిన్ కూడా తన టాటూ వేసుకునే ప్రదేశం కనపడేలా సినిమాలో చూపించాలని అలా అయితేనే నటిస్తాను అని చెప్పగా నిర్మాత సర్దుకోమని చెప్పారట. ఇప్పటికే ఆడవాళ్ళపై అత్యాచారాలు పెరగడానికి సినిమాలు కారణం అంటున్నారు... మీ టాటూలు మేము చూపించి మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పడమంటారూ అని... గేటు అటు అంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: