దిగ్గజ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. దాసరి స్థానాన్ని భర్తీ చేసే బలమైన వ్యక్తి ఎవరున్నారు పరిశ్రమలో అని. అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇందులో ఎవరికీ అభ్యంతరం లేకపోయినా ఇంకా ఈ అంశంపై క్లారిటీ లేదు. కానీ.. ఇండస్ట్రీ అంతా ఏదన్నా సమస్య ఉన్నా.. సలహా కావాలన్నా చిరంజీవి దగ్గరకే వెళ్తూండడం పరిస్థితుల్లో మార్పుకు సంకేతం అని చెప్పాలి. దీనిపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

 

 

'చిత్ర పరిశ్రమలో ఉన్న ఎన్నో సమస్యలకు ప్రస్తుతం పరిష్కారం లేదు. వీటిని పరిష్కరించటానికి దాసరి లేకపోయారు. కానీ.. దాసరి స్థానాన్ని భర్తీ చేసే అర్హత చిరంజీవికి మాత్రమే ఉంది. ఆ బాధ్యతను చిరంజీవి గారే తీసుకోవాలి. ఆయనతో కూడా ఈ విషయం చెప్పాను. ఆయన అట్టడుగు స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. పరిశ్రమలోని సాధక బాధలు గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆయన మాటంటే అందరికీ గౌరవం ఉంది' అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కల్యాణ్ అన్న మాటల్లో కూడా నిజం లేకపోలేదు. 'మా' ఎన్నికల్లో చిరంజీవి మాట, ఓటు కీలక పాత్ర పోషించడం ఆయన మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలుపొందడం తెలిసిందే.

 

 

పైగా.. చిరంజీవి తమ సినిమా ఫంక్షన్లకు గెస్ట్ గా వస్తే మెగాభిమానుల ఆదరణ ఉంటుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. ఇంతటి చిరంజీవి ఆదరణ, కలుపుకుపోయే తత్వం చూసే ఆయన ఈ వాఖ్యలు చేసుంటారని సినీ వర్గాలు అంటున్నాయి.  సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు నిర్మించిన కల్యాణ్. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఎన్నో కీలక పదవులు నిర్వర్తించారు. ప్రస్తుతం నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: