వ్యాపారం అన్నాక ఏది చేసిన రిస్క్ చేయాల్సిందే. అయితే కొన్ని వ్యాపారాల్లో పోయోది పెద్దగా ఉండదు. అలా అని భయంకరమైన లాభాలు సంపాధించలేరు. కానీ విలువలతో కూడుకున్న వ్యాపారం చేసుకుంటూ తృప్తిగా బ్రతికేయోచ్చు. కానీ సినిమా వ్యాపారం అంటే కొన్ని కుటుంబాలు ఒక్కోసారి రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడం అనేది ఒక జూదం లాంటిదని చాలరోజుల నుండి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తూనే ఉంది. అయితే తాజా ఇంకో ఆసక్తికరమైన మాట వినిపిస్తోంది. జూదంలో కనీసం ఎప్పుడో ఒకసారి అయినా డబ్బు వస్తుందని.. లక్కు మన పక్కనంటే జాక్ పాట్ కూడా తగులుతుందని.. స్టార్ హీరోలతో సినిమా చేస్తే చేతికి చిప్ప మాత్రమే వస్తుందని అంటున్నారు. స్టార్ హీరోలతో సినిమా చేయడం జూదం కంటే హీనంగా మారిందని అంటున్నారు. మరి అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది. ఎవరి వల్ల వస్తుంది..?

 

వాస్తవంగా ఇద్దరు బడా స్టార్ల సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.  సినిమాల బడ్జెట్ అదుపులేకుండా పెరిగిపోయిందని.. ఇందులో ప్రమోషన్స్ ఖర్చుకూడా హద్దులు దాటుతోందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాలు మొదలు పెట్టిన సమయంలో ఓవర్సీస్ మార్కెట్.. శాటిలైట్ మార్కెట్.. హిందీ డబ్బింగ్ మార్కెట్ భారీగా ఉండడంతో సినిమాకు రికవరీ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ ఒక్కసారిగా దెబ్బ తినడంతో ఎక్కువగా థియేట్రికల్ రైట్స్ పైన ఆధారపడాల్సి వస్తోంది. దీంతో నిర్మాతలకు డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఇద్దరు నిర్మాతలకు రూ. 50 కోట్లు ఆవసరమని.. ఆ డబ్బు కోసం ఫైనాన్షియర్లకై వెతుకుతున్నారని సమాచారం. ఎన్నారై సర్కిల్స్ నుంచి అప్పుతీసుకుంటే ఇబ్బందులు ఉండవని అలా ప్లాన్ చేస్తున్నారు. డబ్బు ఎలాగూ తిరిగి ఇవ్వాల్సిందే. కానీ ఈ డబ్బు సర్దుబాటు చేసినందుకు ఒక నిర్మాత తన హీరో నెక్స్ట్ సినిమా డేట్స్ ఇప్పిస్తానని హామీ ఇస్తుంటే.. మరో నిర్మాత తన దర్శకుడి డేట్స్ ఇప్పిస్తానని హామీ ఇస్తున్నారట.

 

ఈ విషయాలు బైటకి రావడంతో ఈ నిర్మాతలకు ఎంత ఖర్మ పట్టిందిరా.. అని ఇండస్ట్రీలో కామెంట్లు వినబడుతున్నాయి. అక్కడ ఫ్యాన్స్ ఏమో మా హీరో గొప్ప.. మా హీరో గొప్ప అని కొట్టుకు చస్తుంటారు ఇక్కడ ఆ 'గొప్ప' హీరోల సినిమాల వల్ల బడా నిర్మాతలే ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా హీరో రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి. అంతేకాదు ఎంచుకున్న కథలకి భారీగా ఖర్చు పెట్టకుండా సినిమాను నిర్మించాలి. భారీ బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా సినిమా అంటే గతంలో కొందరు నిర్మాతల మాదిరిగా రోడ్డున పడతారు. ఇక ఈ సంవత్సరం పాన్ ఇండియా సినిమాగా చెప్పుకున్న భారీ బడ్జెట్ సినిమాలు బోర్లా పడ్డాయి. వాటికంటే పెళ్ళి చూపులు, కేరాఫ్ కంచర పాలెం వంటి సినిమాలు చాలా మటుకు నయమని చెప్పాలి. హీరోయిన్స్ ఎక్స్‌ఫోజింగ్ లేదు లిప్ లాక్స్ లేవు..హీరోల భారీ యాక్షన్ సీన్స్ లేవు సినిమాలు మాత్రం సూపర్ హిట్. వీళ్ళని చూసైనా నేర్చుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: