సౌత్.. నార్త్..సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. పోటీని తట్టుకొని ముందువరుసలో నించుని అవకాశాలు దక్కించుకోవాలంటే చాలానే కష్టపడాలి. ఆఫర్లు అందుకోవడం ఎంత కష్టమే..వాటిలో హిట్ అందుకోవడం ఇంకా కష్టం.. సక్సెస్ ను నిలబెట్టుకోవడం మహా కష్టం.. ఇలానే కెరీర్ ను ఏళ్ళ తరబడి కొనసాగించడం నిరంతరం కత్తి మీద సాము చేయడమే. ఇలా చేయాలంటే ఒక హీరోయిన్ కు గ్లామర్.. నటనతో పాటుగా కథల ఎంపిక మీద కూడా పట్టు ఉండాలి. ఏ సినిమాలకు నో చెప్పాలి.. ఏ సినిమాలకు యస్ చెప్పాలి అనే విషయాలు తెలిసి ఉండాలి. అంత టాలెంట్ ఉండాలి. కథ హిట్ అవుతుందనే కాన్‌ఫిడెన్స్ ఉండాలి. ఈ విషయాల్లో తప్పటడుగులు వేస్తే కెరీర్ లో ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. పాయల్ రాజ్ పుత్ అలాంటి పరిస్థితి లోనే ఉందని అర్థమవుతోంది.

 

దేశంలో అతి పెద్ద రేపిస్ట్ నెహ్రూనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సాధ్వీ ప్రాచీ..!

 

డెబ్యూ సినిమా 'ఆర్.ఎక్స్ 100' తో ఒక్కసారిగా గుర్తింపు సాధించింది పాయల్. ఈ తరం హీరోయిన్స్ కి అవసరమైన ఘాటు నటన టన్నుల కొద్ది ఉండడంతో ఒక్క సారిగా ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయింది. ఆ సినిమా తర్వాత పాయల్ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని అంచనాలు వెలువడ్డాయి. అయితే పాయల్ సినిమాల సెలెక్షన్ అంతంత మాత్రమేనని 'ఆర్.డి.ఎక్స్ లవ్' తో అందరికీ అర్థం అయింది. కొన్ని సినిమాల్లో నటిస్తే పేరొస్తుంది.. కొన్ని సినిమాల్లో నటిస్తే ఉన్న పేరు కాస్తా పోతుంది. 'ఆర్.డి.ఎక్స్ లవ్' తో అదే జరిగింది. గ్లామరస్ గా కనిపించి డీప్ గా లిప్ లాక్ ఇచ్చేస్తే స్టార్ హీరోయిన్ అవరు. ఆ విషయం తెలుసుకోకపోతే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇప్పుడు పాయల్ 'వెంకీమామ' పైనే ఆశలు పెట్టుకుంది. 

 

సినిమా లో పాయల్ వెంకటేష్ కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ అయితే పాయల్ కు కొన్ని ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇందులో కూడా ఒక తిరకాసు ఉంది. ఒక్కసారి సీనియర్ స్టార్లతో నటించిన తర్వాత యంగ్ హీరోలు ఆ హీరోయిన్లతో నటించేందుకు ఆసక్తి చూపించరు. నయనతార లాంటివారి విషయంలో ఎక్సెప్షన్ ఉందేమో కానీ మిగతా అందరి విషయంలో అలానే జరుగుతోంది. అలాంటప్పుడు 'వెంకీమామ' లో నటించడం పాయల్ కు రిస్కే. ఈ సినిమా హిట్ అయినా సీనియర్ స్టార్ల నుంచి అవకాశాలు దక్కుతాయేమో కానీ ఈతరం హీరోల సినిమా ఆఫర్లు కష్టమే. కెరీర్ ఆరంభం లోనే సీనియర్ స్టార్ తో నటించి పాయల్ తన కెరీర్ ను కష్టాల్లో పడేసుకుందని ఇప్పటికే టాక్ నడుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: