మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ మరియు ఈటీవీ వారి మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత వెంటనే జీతెలుగు లోని లోకల్ గ్యాంగ్ అనే ఒక కామెడీ షో లో కనిపించాడు. ఈ షో జబర్దస్త్ కు విపరీతమైన పోటీ ఇస్తుందని అంతా ఆశించారు కానీ అక్కడే జీ తెలుగు వారి బృందం పెద్ద తప్పు చేసింది. ఒకవైపు కామెడీ షో లలో నాగబాబు ఉన్న అనుభవం మరియు ప్రేక్షకులను తను ఆకర్షించే విధానం మరొకవైపు అందాల ఆరబోతకు తానెప్పుడూ సిద్ధమంటూ ముందుకు వచ్చే హాట్ యాంకర్ అనసూయ. వీరిద్దరు ఉంటే చాలు తమకు కావాల్సిన రేటింగ్ వస్తుంది అని వారు అనుకున్నారు.


వారి అనుకున్నట్టే అనసూయ తన మార్క్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మరియు అప్పుడప్పుడూ వచ్చిపోయే గెస్ట్ డాన్స్ మాస్టర్ లతో తన చిట్టి నడుముని ఊపుతూ స్టెప్పులేసింది ఈ గ్లామర్ బ్యూటీ. అయితే నాగబాబు కి ఉన్న పేరు మరియు అనసూయ కి ఉన్న క్రేజ్ మాత్రమే ఒక కామెడీ షో టాప్ లో నిలవాలంటే సరిపోవు కదా. అందుకే ప్రేక్షకులు కూడా ఇప్పుడు జీ తెలుగు వారికి సూటిగా ఒకే ఒక ప్రశ్న సంధిస్తున్నారు. నాగబాబు అనసూయ ఉన్నంత మాత్రాన పెద్ద ఉపయోగం ఏముంది అసలైనది లేకపోతే అని.

 

ఈరోజుల్లో ఈటీవీలో జబర్దస్త్ చూసే వాళ్ళలో సగం పైగా టీవీ లో కాకుండా యూట్యూబ్ లో నే చూస్తున్నారు కావాలంటే యూట్యూబ్ లో ఉండే జబర్దస్త్ వీడియో క్లిప్స్ కింద చూస్తే మీకు మిలియన్లలో వ్యూ కౌంట్ ఉంటుంది. అది కూడా వారి వీడియో పోస్ట్ చేసిన 24 గంటల తర్వాత కావడం గమనార్హం. కాబట్టి ప్రేక్షకులంతా 'లోకల్ గ్యాంగ్' కామెడీ షో కి సంబంధించిన వీడియో క్లిప్స్ ని కూడా యూట్యూబ్ లో పెట్టమని గొడవ చేస్తున్నారు. జీ తెలుగు వారు వీలైనంత త్వరగా స్పందించి అందుకు సంబంధించిన ఎపిసోడ్ యూట్యూబ్ లో పెట్టక పోతే తర్వాత చింతించాల్సిన ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: