ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాల సినిమాలు ఎంతటి అత్యద్భుత విజయాన్ని అందుకున్నాయో మనకు తెలిసిందే. ఇక ఆ సినిమాల విజయం తరువాత రాజమౌళి పేరు మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా మరు మ్రోగింది. అయితే ఆ సినిమాల తరువాత తొలిసారిగా మెగా, నందమూరి స్టార్ హీరోలిద్దిరితో కలిసి ఆర్ఆర్ఆర్ అనే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీని మొదలెట్టారు రాజమౌళి. 

 

ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో నటించే విలన్స్ మరియు ఎన్టీఆర్ హీరోయిన్ ని ఇటీవల ప్రకటించింది సినిమా యూనిట్. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాకు వి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి కొమరం భీంగా నటిస్తున్న ఎన్టీఆర్ లుక్ నేడు సోషల్ మీడియా మాధ్యమాల్లో లీక్ అయింది. ఆ లుక్ లో ఎన్టీఆర్ ని చూసిన ఆయన ఫ్యాన్స్, సినిమాపై పెట్టుకున్న ఆశలను మరింతగా పెంచేసాయి అనే చెప్పాలి. 

 

లీక్ అయిన ఈ లుక్ లో ఎన్టీఆర్ నల్లరంగు జుబ్బా, తెల్ల పంచె కట్టుకుని ఎరుపు రంగు తలపాగా పెట్టుకున్నట్లు గమనించవచ్చు. కాగా ఈ లుక్ ని షూటింగ్ జరుగుతున్న సమయంలో అందులోని సిబ్బంది ఒకరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎన్టీఆర్ లుక్ తాలూకు ఫోటోతో పాటు వీడియో కూడా లీక్ అయింది. అయితే వీటిని మరింత వ్యాప్తి కాకుండా సినిమా యూనిట్ కట్టడి చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తన్నారు. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి సినిమాను 2020 జులై 30న రిలీజ్ చేయనున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: