రాజమౌళి డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా తారక్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఎంత జాగ్రత్త పడుతున్నా కూడా లీకులు జరుగుతున్నాయి.

 

సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మొదట్లోనే ఫోటోలు లీక్ అవగా ఇప్పుడు కొమరం భీం లుక్ కూడా లీక్ అయినట్టు తెలుస్తుంది. సినిమాలో కొమరం భీం గా తన సత్తా చాటనున్నారు. బాహుబలి తరహాలో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ చేస్తారని అనుకోగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకముందే సినిమా నుండి కొన్ని పిక్స్ లీక్ అవడం పై రాజమౌళి చాలా సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది.

 

ఇక లీకైన ఫోటోలో ఎన్.టి.ఆర్ కొమరం భీం లుక్ లో అదిరిపోయాడు. ఓ సమావేషంలో ప్రజలందరికి ఏదో చెబుతున్నట్టుగా తారక్ కనిపించాడు. అయితే ఈ లుక్ అలా లెకైందో లేదో అలా వైరల్ అయ్యింది. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్సే ఆర్.ఆర్.ఆర్ ఎన్.టి.ఆర్ లుక్ ను వైరల్ చేస్తున్నారు. జనవరి 10 కల్లా గుమ్మడికాయ కొట్టేసి అనుకున్న విధంగానే 2020 జూలై 30న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.

 

బాహుబలి తర్వాత సినిమా కాబట్టి ఆర్.ఆర్.ఆర్ సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. మూవీలో అజయ్ దేవగన్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా బాహుబలిని మించి వసూళ్లను రాబడుతుందో లేదో చూడాలి. ఈ లీకులకు సంబంధించి చిత్రయూనిట్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోనున్నాడట రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: