ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో  పాటుగా దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ తనకంటూ ఉండటంతో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీస్తున్న 'RRR'  సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ తాజాగా ఈ సినిమాకి షూటింగ్ కి సంబంధించి వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో రిలీజ్ కావడంతో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో రాజమౌళి సినిమా యూనిట్ పై తీవ్ర ఆగ్రహం చెంది విమర్శలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా సినిమా షూటింగ్ సమయంలో సినిమా యూనిట్ సభ్యులు ఎవరు కూడా సెల్ ఫోన్ వాడకూడదని రాజమౌళి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా వార్తలు వినబడుతున్నాయి.

 

అయితే లీక్ అయినా వీడియో లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనబడుతున్నాడు. అంతేకాకుండా ఒక ఉద్యమకారుడిగా పల్లె ప్రజలను వారి బాధలను అప్పటి జమీందారుల జాగీరు లనుండి విడిపించడానికి పోరాటం చేసే వాడిగా అదరగొట్టే లుక్కులో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. అయితే మరోపక్క బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్న ఈ క్రమంలో లీక్ అయినా వీడియో బట్టి చిత్ర యూనిట్ పై రాజమౌళి  ఫుల్ కోపంగా ఉన్నారట. అంతేకాకుండా అసలు ఈ వీడియో తీసిన వాళ్ళు ఎవరు అన్నదాని విషయంపై సమాధానం రావాలని సినిమా షూటింగ్ కి సంబంధించి పనులను పర్యవేక్షించే డిపార్ట్మెంట్ కి వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని రాజమౌళి తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో అసలు షూటింగ్ జరుగుతున్న సందర్భంలో ఆ వైపుగా నిలబడిన వాళ్ళు ఎవరు అన్నా దానిపై ఆరా తీయాలని ఇంకా ఎన్ని వీడియోలు ఆ వ్యక్తి దగ్గర ఉన్నాయో వంటి విషయాలను రాబట్టాలని గట్టిగా చిత్ర యూనిట్ సభ్యులకు ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చినట్లు ఫుల్ సీరియస్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: