గతంలో వినోద౦ అంటే చాలా మందికి సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూడటం... లేదా టీవీ లో ఏదైనా కార్యక్రమాలువస్తే ఆసక్తిగా వాటిని చూడటం... కాని ఇప్పుడు టెక్నాలజీ పరుగులు పెడుతున్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, యుట్యూబ్ వంటివి వచ్చిన తర్వాత చాలా మంది వాటి మీద ఆధారపడుతున్నారు. వెబ్ సీరీస్ లకు క్రేజ్ కూడా బాగా పెరిగింది అనేది వాస్తవం. ప్రేక్షకుల సంఖ్య కూడా వాటికి క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీనితో పలు నిర్మాణ సంస్థలు వాటి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి.

 

వెబ్ సీరిస్‌ల‌తో ఆదాయం కూడా ఎక్కువ‌గానే ఉంది. ఇవి ఎంతో మందికి ఉపాధి ఇస్తున్నాయి. చాలా మంది త‌క్కువ టైంలోనే పాపుల‌ర్ అవుతున్నారు. సినిమాల్లో అవకాశాలు రాని హీరోయిన్లు, సీనియర్ హీరోయిన్లు, పాత తరం హీరోయిన్లు కూడా చాలా మంది వెబ్ సీరీస్ ల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తక్కువ సమయంలో షూటింగ్ అయిపోవడం, కథలు ఆసక్తిగా ఉంటే అభిమానులు ఎక్కువగా ఆదరించడంతో ఇప్పుడు వాటి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారట. తాజాగా మాజీ హీరోయిన్... మాధురి దీక్షిత్ వెబ్ సీరీస్ లో అడుగుపెట్టింది. ప్ర‌ముఖ డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓ వెబ్‌సిరీస్‌ను నిర్మించ‌నుంది. 

 

మాధురీ దీక్షిత్ త‌మ వెబ్‌సిరీస్‌లో న‌టిస్తున్నార‌ని, దీనిపై అధికారిక ప్రకటన చేసింది ఆ సంస్థ... త్వరలోనే షూటింగ్ కూడా మొదలుపెడతామని చెప్పింది. అదే విధంగా ఈ సీరీస్ లో బాలివుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా నటిస్తున్నారు. ఆయన కూడా దీనిపై ప్రకటన చేసారు. ఇటీవల ఈశా రెబ్బ అనే యువ హీరోయిన్ కూడా వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెట్టింది. త్వరలోనే మరికొందరు హీరోయిన్లు కూడా వెబ్ సీరీస్ లలో నటించడానికి పెట్టుబడులు కూడా పెట్టేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్... దీపిక పదుకోన్ కూడా వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: