టాలీవుడ్ లో ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 మూవీస్ కి ఐదు సంవత్సరాలు పట్టింది.  ఆ ఐదు సంవత్సరాలు ఆయన పడ్డ కష్టానికి ప్రపంచం మెచ్చుకుంది.  ఇప్పటి వరకు భారతీయ చలన చిత్ర రంగంలో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగింది.  ఈ మూవీతో ప్రభాస్ ఏకంగా జాతీయ నటుడిగా మారిన విషయం తెలిసిందే.  బాహుబలి సీరీస్ తో టాలీవుడ్ స్థాయి జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ గా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మద్య చిన్న స్టార్స్ నుంచి పెద్ద స్టార్స్ వరకు లీకేజ్ ల బెడద ఎక్కువైంది. గతంలో బాహుబలి కి సంబంధించిన కొన్ని యుద్ద సీన్లు నెట్టింట్లో ప్రత్యక్షం అయ్యాయి..దాంతో చిత్ర యూనిట్ గందరగోళంలో పడింది.  

 

మొత్తానికి నెట్ నుంచి ఆ వీడియో డిలీట్ చేయించారు.  ఆ తర్వాత బాహుబలి 2 విషయంలో రాజమౌళి ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు.  షూటింగ్ సమయంలో సెల్ ఫోన్ పక్కన బెట్టి రావాలని.. అన్ని చోట్ల సీసీ కెమెరాలు అమర్చడం..ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇదే ఫార్ములా ఆర్ ఆర్ఆర్ విషయంలో కూడా తీసుకుంటున్నారట.  కానీ  షూటింగ్ స్పాట్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. రాజమౌళి సూప‌ర్ మ‌ల్టీస్టార‌ర్ ఫోటోస్ ఇప్పుడు నెట్లో సంచ‌ల‌నంగా మారుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో పోలీస్ స్టేష‌న్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే ఈ క‌థ 19వ శ‌తాబ్దంలో సాగుతుంది. జూనియ‌ర్ ఆర్టిస్టుల‌తో పాటు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కూడా అక్క‌డే ఉన్నారు.

 

కొమరం భీం పాత్రను చేస్తున్న ఎన్టీఆర్ గుర్రం స్వారీకి సీన్స్ , సైన్యంతో తలపడే సన్నివేశాలను పెద్ద ఎత్తున ఉన్నాయి. అందుకోసం ఎన్టీఆర్ గుర్రం స్వారీని ప్రాక్టీస్ చేస్తున్నారు. గుర్రాన్ని మచ్చిక చేసుకోవడానికి ఎన్టీఆర్ ట్రై చేస్తున్నాడు . సెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో లీక్ అయ్యింది. అంతే కాదు రాజమౌళి ఎన్టీఆర్ కి ఏదో సూచిస్తున్నారు.. ఎన్టీఆర్ ఏదో డైలాగ్ చెబుతున్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి లీకైన్ ఫోటోలు చూస్తుంటే  ఈ చిత్ర క‌థ కూడా ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: