దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన యువ నటుడు రామ్, తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలియానాతో కలిసి రామ్ నటించిన ఆ సినిమాకు వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. ఆ తరువాత ఆయన నటించిన సినిమాల్లో కొన్ని ఫ్లాప్ అవ్వగా మరికొన్ని మంచి విజయాలు అందుకుని, రామ్ కు యూత్ లో మంచి క్రేజ్ తీసుకు వచ్చాయి. కాగా ఆయన కెరీర్ లో రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ వంటి సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. 

 

కాగా ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్, అంతకముందు కొద్దికాలంగా వరుసగా ఫ్లాప్స్ ని చవిచూశారు. అయితే వాటిలో ఇటీవల రిలీజ్ అయిన హలో గురు ప్రేమకోసమే సినిమా, అభిమానుల మరియు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక కేవలం పర్వాలేదనిపించింది. కాగా ఆ సినిమా హిందీ వెర్షన్ ని  కొద్దిరోజుల క్రితం ధూమ్ ధార్ ఖిలాడీ పేరుతో యూట్యూబ్ లో డబ్ చేసి అప్ లోడ్ చేసారు. కాగా నేడు యూట్యూబ్ లో ఆ సినిమా ఒక గొప్ప రికార్డు ని సొతం చేసుకోవడం జరిగింది. 

 

ఇప్పటివరకు ఈ సినిమా 141 మిలియన్లకు పైగా వ్యూస్ తో అలానే 1 మిలియన్ లైక్స్ సాధించి, ఇంకా అదరగొడుతూ దూసుకుపోతోంది. నిజానికి మరే సౌత్ ఇండియన్ సినిమాకు కూడా హిందీ డబ్బింగ్ వెర్షన్ లో 1 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం జరగలేదు. తన సినిమా ఇంత గొప్ప ఫీట్ సాధించడంతో రామ్ , తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆనందం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది......!!   

మరింత సమాచారం తెలుసుకోండి: