తెలుగులో సూపర్ హిట్టైన అర్జున్ రెడ్డి సినిమాతో చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ ను ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాడు విక్రం. విజయ్ దేవరకొండ కెరియర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమాలో అతని పర్ఫార్మెన్స్ కు అందరు అతని ఫ్యాన్స్ అయిపోయారు. అయితే ఆ సినిమా రీమేక్ గా బాలా డైరక్షన్ లో సినిమా దాదాపు పూర్తికావొచ్చింది. వర్మ టైటిల్ తో తెరకెక్కించిన సినిమా రష్ అంత చూసిన విక్రం చెత్తలా ఉందని అనేయడంతో బాలా తీసినదంతా నిజంగానే చెత్తలో పడేశారు.

 

ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన గిరీశయ్యతో మళ్లీ అర్జున్ రెడ్డి రీమేక్ ప్రయత్నించారు. టైటిల్ కూడా వర్మ అనుకున్నది కాస్త ఆదిత్య వర్మగా మార్చారు. గిరీశయ్య ఎంట్రీ ఇచ్చాక కాస్త సీన్ మారింది. తమిళ అర్జున్ రెడ్డి మీద కూడా అంచనాలు పెరిగేలా చేశాడు గిరీశయ్య.

 

అయితే నిర్మాతలు ఇప్పుడు ఈ సినిమాను డైరెక్ట్ గా ఆన్ లైన్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అదేంటి అంటే వాళ్లు రిలీజ్ చేసేది గిరీశయ్య చేసే ఆదిత్య వర్మని కాదు బాలా చేసిన వర్మ సినిమాను. కథ ఒకటే అయినా బాలా తన టేకింగ్ తో వేరే లెవల్ లో ఈ సినిమా తీశాడట. అలా పక్కన పెట్టడం కన్నా డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తే బెటర్ అని నిర్మాతలు అనుకున్నారు.

 

త్వరలోనే దీనికి సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. మరి ఒకే సినిమాను ఇద్దరు దర్శకులతో తీసి ఒకరి సినిమాను ఆన్ లైన్ లో.. మరొకరి సినిమాను థియేటర్ లో రిలీజ్ చేయడం బహుశా ఈ సినిమాకే అలా జరిగి ఉండొచ్చు. ఈ నిర్ణయంపై బాలా ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. మొత్తానికి ధ్రువ్ మొదటి సినిమాకే చాలా ఇబ్బందులు పడుతున్నాడు అన్నది మాత్రం నిజం. 

మరింత సమాచారం తెలుసుకోండి: