దిశ అత్యాచారం హత్య సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు అందరూ తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆమె పై అత్యాచారం చేసి, హ‌త్య చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో ప్ర‌తి ఒక్క‌రు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ సమాజంలో మార్పు కోసం... అందరిలో మార్పు రావాలని సలహాలు ఇస్తున్నారు. ఎవరికి వారు తమకు ఉన్న సామాజిక స్పృహను బయట పెడుతున్నారు. నిందితులను కాల్చి చంపిన పోలీసులను మెచ్చుకుంటున్నారు.

 

ఈ క్ర‌మంలోనే కొంద‌రు నెటిజ‌న్లు సమాజంలో ఎంతో మందిని ప్రభావితం చేసే హీరోయిన్లు కూడా తాము వేసుకునే వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. మనుషులను రెచ్చగొట్టే విధంగా హాట్ డ్రెస్‌లు వేసుకో కూడదు అని కూడా కొందరు వాళ్లకు సూచనలు జారీ చేశారు. ఇలా ఉంటే తాజాగా యాంకర్ అనసూయ అసభ్యంగా కొన్ని ఫోటోల్లో కనబడింది. దిశ విషయంలో అనసూయ ఓ రేంజ్‌లో లెక్చ‌ర్ దంచి కొట్టింది.

 

అలాంటిది ఇప్పుడు ఆమె హాట్ డ్రెస్సులు వేసుకుని స‌మాజానికి ఏం సందేశం ఇస్తోంద‌న్న విమ‌ర్శ‌లు నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉండి కూడా... సినిమా అవకాశాల కోసం మీరు సోషల్ మీడియాలో ఇలాంటి హాట్ ఫొటోలు పెడ‌తారా ? అని వారు ఫైర్ అవుతున్నారు. అలాగే మీ భర్త తలకు మసాజ్ చేస్తూ మీరు తొడలు కనపడుతూ పెట్టిన ఫోటో గురించి ఏం చెప్తారు అని ?  కూడా వారు ప్ర‌శ్నిస్తున్నారు.

 

టీవీ షోలు, సినిమాల్లో ఛాన్స‌ల కోసం ట్రై చేసుకుంటే త‌ప్పు లేదు కాని..ఇలా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయ్యి ఉండి కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకుని.. కుర్ర కారును రెచ్చ గొడుతూ.. బ‌య‌ట స‌భ్య స‌మాజం గురించి నీతులు చెప్ప‌డం మాత్రం బాగోలేద‌ని ప‌లువురు నెటిజ‌న్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. మ‌రి అన‌సూయ ఇక‌పై అయినా త‌న హాట్ నెస్‌ను త‌గ్గిస్తుందో ?  లేదో ?  చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: