నటి శ్రియ పెళ్లి తర్వాత అసలు సినిమాల గురించే ఆలోచించడం మానేసినట్లున్నారు. ఎందుకంటే ఆమె నుంచి తెలుగులో సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. ఇక శ్రియ తెలుగులో బాలయ్యకు జోడీగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాలో చివరిసారిగా నటించారు. అయితే శ్రియ పెళ్లి చేసుకోవడం వల్లే తెలుగులో సినిమా అవకాశాలు రావడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 

ఇకపోతే లండన్ పోలీసులు నటి శ్రియను పట్టుకున్నారనే వార్తలు వెలువడుతున్నాయట. ఈ విషయాన్ని క్షుణంగా తెలుసుకుంటే ‘సందకారి’ అనే సినిమాలో శ్రియ ప్రస్తుతం నటిన్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ లండన్‌లో జరుగుతున్న సందర్భంగా శ్రియ అక్కడి ఎయిర్‌పోర్ట్‌లోని ఓ హై సెక్యూరిటీ ప్రాంతంలోకి అనుమతి లేకుండా వెళ్లడంతో పోలీసులు గన్ పాయింట్‌లో ఆమెను పట్టుకున్నారట.

 

 

షూటింగ్ అక్కడే జరుగుతుండడంతో శ్రియ సరదాగా విహరిస్తుంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విమల్‌ కు విషయం తెలిసి చిత్ర యూనిట్ సభ్యులతో పాటు వెళ్లి పోలీసులతో మాట్లాడి వారికి షూటింగ్ డాక్యుమెంట్స్ చూపిస్తే కానీ పోలీసులు శ్రియను వదిలేశారట.

 

 

అయితే ఈ విషయమై శ్రియ నుంచి కానీ యూనిట్ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఇకపోతే మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘మై బాస్’ సినిమాకు ‘సందకారి’ రీమేక్‌గా రాబోతోంది. ఇక ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నహాలు చేస్తున్నారట.. ఇకపోతే ఎంత మంచి పేరు ప్రతిష్టలున్న ఏదో ఒక తప్పు చేసి ఎక్కడో  ఒకచోట దొరికి పోతారు మన తారలు. ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకొన్న శ్రియ కూడా ఇలాగే చిన్న చిన్న మిస్టేక్స్ చేసి అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తారు. అయినా ఇదంతా సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణమే అని అనుకుంటున్నారు ఈ విషయం తెలిసినవారు కొందరు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: