ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పేద ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఇంగ్లీష్ మీడియం విద్యను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. కావాలని జగన్ తెలుగు భాషని తెలుగు సంస్కృతిని చంపేస్తున్నారు అని ఇంగ్లీష్ మీడియం విద్య వల్ల ఉపయోగం ఏమీ ఉంటుందని ప్రభుత్వ పాఠశాలలో ఎప్పటి లాగానే తెలుగు రేడియం ద్వారానే విద్యను పేద పిల్లలకు సామాన్యులకు చెప్పించాలని దానివల్ల సంస్కృతి మూలాలు కాపాడిన వారవుతారు అని భాష వల్ల రాష్ట్రాలు విడిపోయినా సందర్భాలు ఉన్నాయని జగన్ రెడ్డి గారు అది తెలుసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అంతేకాకుండా ఉన్నట్టుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశం పెట్టడం వల్ల స్కూల్ లో పనిచేస్తున్న టీచర్లకు ప్రావీణ్యం ఉండదని దాంతో పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని వ్యతిరేకించడం జరిగింది.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న క్రమంలో మూడవరోజు జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్... సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం విద్యని తీసుకురావడం పట్ల సంతోషంగా ఉందని అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియం విద్యని వ్యతిరేకించాల్సిన అవసరం ప్రస్తుతం ఏమీ లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఇటువంటి విద్య అప్పట్లో అందుబాటులో లేక చిన్న వయసులోనే చాలామంది గల్ఫ్ దేశాలకు కూలీలుగా వెళ్లారని ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తున్నారు అంటూ ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం తప్పనిసరి అని జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని పొగడ్తల వర్షం కురిపించడంతో… జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

 

ముఖ్యంగా జనసేన రాపాక వరప్రసాద్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న క్రమంలో పార్టీ అధినాయకుడు వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇష్టానుసారంగా వ్యవహరించటం ఏంటి అంటూ కోపంతో  రగిలిపోతూ జనసేన పార్టీ కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అయితే సోషల్ మీడియాలో జనసేన పార్టీ కార్యకర్తలు వార్నింగ్ ఇస్తూ అదే సమయంలో తెలుగు భాష గురించి అసెంబ్లీలో అసలు ఎందుకు ప్రస్తావనకు తీసుకురాలేదని ఒకపక్క అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఇంగ్లీష్ మీడియం విద్యపై పోరాడితే... మీరు అనుకూలంగా మాట్లాడటం సిగ్గుచేటు అంటూ రాపాక వరప్రసాద్ వ్యవహారంపై మండిపడుతున్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: