టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో మాస్ ఇమేజ్ సంపాదించారు పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్’ మూవీతో పవన్ కళ్యాన్ సెన్సేషన్ సృష్టించారు.  పవన్ కళ్యాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా ఈ మూవీ దుమ్మురేపింది.  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ దబాంగ్ రిమేక్ గా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ తో పవన్ కళ్యాన్ స్టార్ డమ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది.  ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాన్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ పవన్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.  అయితే ఈ మూవీ పవన్ కళ్యాన్ ఎంతో ఇష్టంగా  సొంతంగా స్క్రిప్ట్ రాసి..మొదట దర్శకుడిగా సంపత్ నందికి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆయన విషయంలో సంతృప్తి చెందక ఆ మూవీని కె.ఎస్.రవింద్ర (బాబీ) కి అప్పగించారు.

 

బాబీ శాయశక్తులా ఈ మూవీ గురించి కష్టపడ్డారు. కాకపోతే ఈ సినిమా మాత్రం ఆడియన్స్ ని మెప్పించలేక డిజాస్టర్ అయ్యింది. దాంతో మెగా ఫ్యాన్స్ బాబీని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు..ఇలాంటి చెత్త సినిమా మా హీరోకి ఇస్తావా అని దారుణంగా ఆడేసుకున్నారు.  మొత్తానికి 'సర్దార్' ఫ్లాప్ ఎఫెక్ట్ బాబీపై పడింది. కొంత కాలం బాబీ సైలెంట్ గా ఉన్నా.. ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’ లాంటి బ్లాక్ బస్టర్ తీశారు.  తాజాగా 'వెంకీ మామ' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో అపజయాలు ఖాయమని, ఏ సినిమా ఫలితం ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరని.. 'సర్దార్' ఫలితం గురించి తాను అసలు బాధ పడలేదని బాబీ స్పష్టం చేశాడు.  

 

ఒక దర్శకుడు తన కెరీర్ లో అన్నీ సూపర్ హిట్ సినిమాలే తీయాలని లేదు.. కొన్ని సార్లు ఫ్లాపు లు ఎదురవుతాయి..వాటి నుంచి ఎంతో నేర్చుకుంటాం. తాను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని, జీవితంలో ఒక్క ఫోటో అయినా దిగితే బాగుండనే వ్యక్తితో సినిమా చేయడం అన్నది ఎంతో సంతోషం కలిగించిన విషయం అని అన్నారు. ఆ రెండేళ్లలో ప్రతీరోజుని, ప్రతీ క్షణాన్ని ఆశ్వాదించానని, ఆ జ్ఞాపకాలు తనకు చాలని సినిమా హిట్టా.. ఫ్లాపా అని నేను ఎప్పుడూ బాధపడలేదు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: