టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ ఎవరంటే అందరు ముక్త కంఠంతో చెప్పే ఒకే ఒక్క పేరు రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడిగా రాజమౌళికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. బాహుబలి తర్వాత ఆయన ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్, కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. 2020 జూలై 30న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. 

 

ఇదిలాఉంటే రాజమౌళి స్పూర్తితోనే కొందరు ఆయన దారిలో నడుస్తున్నారు. బాహుబలి సినిమా ముందు ఒక సినిమాగానే రిలీజ్ చేయాలని భావించారు. కాని సెట్టింగులు, బడ్జెట్ ఎక్కువవడం వల్ల ప్లాన్ చేంజ్ చేశారు. కథను మధ్యలో ఆపేసి పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా చేశారు. అయితే పార్ట్ 2 కూడా అంతకుమించి అనిపించేలా ఉండటంతో సూపర్ సక్సెస్ అయింది. అసలు సిసలు సీక్వల్ సినిమాగా బాహుబలి చరిత్రలో మిగిలిపోయింది.

 

అయితే బాహుబలి లానే ఇప్పుడు ఓ సినిమా ఒక కథతో రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారట. ఆ సినిమాలో కూడా అనుష్క హీరోయిన్ గా నటించడం విశేషం. హేమంత్ మధుకర్ డైరక్షన్ లో అనుష్క లీడ్ రోల్ లో వస్తున్న సినిమా నిశ్శబ్ధం. ఈ సినిమాలో మాధవన్, షాలిని పాండేలు కూడా నటిస్తున్నారు. మూవీ అంతా యూరప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. సినిమాను అసలైతే డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని జనవరి 24కి వాయిదా వేశారు.

 

ఈ సినిమాను కూడా రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట నిర్మాత కోనా వెంకట్. నిశ్శబ్ధం హిట్ అయితే నిశ్శబ్ధం పార్ట్ 2 తీసేలా ప్లాన్ చేశారట. అందుకే నిశ్శబ్ధం కథ అర్ధాంతరంగా ఆగుతుందని తెలుస్తుంది. అంటే రాజమౌళి కాబట్టి సినిమాను ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేశాడు మరి నిశ్శబ్ధం కూడా అలా చేసేందుకు వీలు ఉంటుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: