స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. బన్నీ క్లాస్, మాస్ రెండూ కలగలిపిన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులు సహా బన్నీ ఫ్యాన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా ఇందాక రిలీజ్ అయిన టీజర్, 

 

వారి అంచనాలు మరింతగా పెంచేలా ఉంది అని చెప్పకతప్పదు. మంచి యాక్షన్ తో పాటు ఒకింత స్టైలిష్ గా సాగిన ఈ టీజర్ పై సర్వత్రా మంచి స్పందన లభిస్తోంది. ఇకపోతే ఈ టీజర్ లో విలన్ గా నటిస్తున్న సముద్రఖని, కారు లో నుండి దిగగానే బన్నీ అతడితో కొంత మూతి వంకర పెడుతూ, 'నువ్వు  ఇప్పుడు కారులో నుండి దిగావు, కానీ నేను ఇప్పుడే క్యారెక్టర్ లోని ఎక్కాను' అనే డైలాగ్ చెప్తాడు. అయితే ఆ డైలాగ్ డెలివరీ సమయంలో బన్నీ మూతి వంకరగా పెట్టి చెప్పే విధానం, జైలవకుశ సినిమాలోని ఎన్టీఆర్ రవాణ క్యారెక్టర్ లో నత్తివాడిగా చెప్పే డైలాగ్ ని కొంత వెక్కిరించేలా ఉందని కొందరు నెటిజన్లు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. 

 

కావాలనే బన్నీ, త్రివిక్రమ్ ఇద్దరూ కూడా ఆ డైలాగ్ తో ఎన్టీఆర్ ని టార్గెట్ చేసారని వారు వాదిస్తున్నారు. అయితే ఇది అంతా అర్ధం లేని వాదన అని, ఎందుకంటే అక్కడక్కడా కొన్ని సినిమాల్లో ఒక సీన్ ని పోలిన మరొక సీన్ ఉంటే ఉండవచ్చని, అంతమాత్రాన దానిని పట్టుకుని మరొక హీరోని తక్కువ చేయడానికి అలా చేసారని అనడం సరైనది కాదని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. మరి ఈ వాదనకు ముగింపు ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: