టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఎట్టకేలకు నేడు రిలీజ్ అయింది. సినిమాకు మొదటగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ పెట్టిన వర్మ, దాని పై పలు వివాదాలు తలెత్తడంతో చివరికి ఆ సినిమా టైటిల్ ని మార్చి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా నిర్ణయించారు. ఇక ఎట్టకేలకు పలు సమస్యల నుండి బయట పడ్డ ఈ సినిమా, నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే రెస్పాన్స్ సంపాదిస్తోంది. ఇకపోతే ఈ సినిమా చూసిన వారందరూ చప్తున్న మాట ఏంటంటే, 

 

వర్మ ఈ సినిమాలో ముఖ్యంగా చంద్రబాబు మరియు లోకేష్ లను బాగా సెటైరికల్ గా టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు. గత ఏడాది తాను తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అప్పట్లో ఆంధ్రాలో అధికారంలో ఉన్న టిడిపి పార్టీ మరియు అధినేత చంద్రబాబు రిలీజ్ కాకుండా ఆపడంతో, అప్పటి నుండి వర్మ ఒకింత టిడిపి పై తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా పలు విధాలుగా వారి పై కామెంట్స్ మొదలెట్టారు. ఇక ఒకడుగు ముందుకు వేసి, ప్రస్తుతం తీసిన ఈ సినిమా ద్వారా బాబును పలు విధాలుగా ఏకేశాడట వర్మ. ఇక ఈ సినిమాలో దాదాపుగా ఆంధ్రలోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు అందరినీ కూడా టార్గెట్ చేసిన వర్మ

 

మధ్యలో కొందరు నాయకులను పోలిన వారితో చేయించిన సీన్స్ పై ప్రేక్షకులు బాగా  ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా నుండి మంత్రిగా పని చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ని మాదిరిగా పోలిన వ్యక్తితో వర్మ చెప్పించిన డైలాగ్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోంది. ఎప్పుడు వచ్చాం అని కాదు, బులెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం అంటూ బాబుపై  అనిల్ కుమార్ యాదవ్ చెప్పే డైలాగ్ అదిరిందంటున్నారు. ఇక ఇదొక్కటే కాదు, ఇంకా ఎన్నో సెటైర్లు ఈ సినిమాలో ఉన్నాయని, మొత్తానికి టిడిపి మరియు చంద్రబాబు పై తనకున్న అక్కసుని వర్మ బాగానే వెళ్లగక్కినట్లు చెప్తున్నారు కొందరు ప్రేక్షకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: