ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఈరోజు విడుదలైంది. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో వర్తమాన రాజకీయాల్లో ప్రముఖులెవ్వరినీ వదిలిపెట్టలేదు. పాత్రల పేర్లలో, పార్టీల పేర్లలో కొన్ని మార్పులు చేసిన ఆర్జీవీ పాత్రలకు పోలిన నటీనటుల్ని ఎంచుకున్నాడు. సినిమాలో మనసేన పార్టీని, మనసేన పార్టీ నుండి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేను చూపిస్తూ ఆ పాత్రతో కూడా వర్మ కామెడీ చేయించాడు. 
 
మనసేన పార్టీ ఎమ్మెల్యే సమావేశాల్లో మాట్లాడుతూ చివరకు ఏం మాట్లాడాలో తెలీక ఒక పేపర్ స్లిప్ తీసుకొని అందులో రాసుకున్న విషయాలను మాట్లాడుతూ ఉంటాడు. మనసేన పార్టీ ఎమ్మెల్యే మా పార్టీ నుండి నేను మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచానని నా పార్టీలో నేనే నంబర్ వన్ అనే డైలాగ్ ను పదే పదే చెబుతూ కామెడీ పండిస్తూ ఉంటాడు. మనసేన పార్టీ అధినేత బహిరంగ సభలో మాట్లాడుతూ ఉంటే అధినేత వెనుక కార్యకర్తలు తప్ప వినే ప్రజలు ఎవరూ కనపడరు. 
 
వర్మ పరోక్షంగా మనసేన పార్టీకి కార్యకర్తలు తప్ప ఓట్లు వేసే ప్రజలు ఎవరూ లేరని చెప్పకనే చెప్పాడు. మనసేన పార్టీ అధినేత పాత్రతో కూడా కామెడీ చేయించాడు. మనసేన పార్టీ అధినేత ముఖం మీద జుట్టు పడుతూ ఉంటే పదే పదే సరిచేసుకుంటూ మెడలో ఎర్ర తువ్వాలు వేసుకొని ప్రజలకు సేవ చేయడానికి సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వచ్చాననే డైలాగ్స్ చెప్పిస్తూ వర్మ మనసేన పార్టీ అధినేత డైలాగులతో కామెడీ పంచాడు. సినిమాలో ఆర్జీవీ బాబు పాత్రను నెగిటివ్ షేడ్ లో చూపించాడు. 
 
ప్రేక్షకులు బాబును భీభత్సంగా అభిమానించే ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకు రావద్దని చెబుతున్నారు. రామ్ గోపాల్ వర్మ దమ్మున్న డైరెక్టర్ అని సినిమాలోని పాత్రలన్నింటినీ పచ్చిగా చూపించాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. క్లైమాక్స్ సన్నివేశాలను ఆర్జీవీ అద్భుతంగా తెరకెక్కించాడు. విడుదలకు ముందు ఎన్నో వివాదాలకు ఎదుర్కొన్న అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకులను ఆకట్టుకొవటంలో సఫలమైందని చెప్పవచ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: