'మొండివాడు రాజు కంటే బలవంతుడు' అనే సామెత ఉంది. ఒకప్పటి సెన్షేషనల్ దర్శకుడు.. ప్రస్తుత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా చూసిన ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. వర్మ తాను అనుకున్నది, చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా చెప్పాడు. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు  అడ్డుకుని, ఇబ్బందులు పెట్టిన దానికి వర్మ సరైన రీతిలో బదులు తీర్చుకున్నాడనే చెప్పాలి.

 

 

సినిమా విడుదలపై టీడీపీ నుంచే కాకుండా వైసీపీ నుంచి కూడా కొన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్నో అవాంతరాలు దాటి మొత్తానికి విడుదలకు నోచుకుంది. సినిమా ఆద్యంతం టీడీపీని ఓ ఆట ఆడుకున్నాడు వర్మ. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చేసిన పనులను సెటైరికల్ గా చూపించడం తనకు మాత్రమే సాధ్యం అని నిరూపించాడు. వ్యక్తిగతంగా టీడీపీ నాయకులను విమర్శించిన తీరు వర్మ ధైర్యాన్ని తెలియజేస్తోంది. ఇక చినబాబు క్యారెక్టర్ ను వర్మ ఆడుకున్న తీరు సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు, లోకేశ్.. ఇలా అయిపోయుంటారని.. వారి మానసిక వేదన ఇలా ఉండుంటుందని చూపించిన తీరు కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. పులి కడుపున పిల్లి.. అనే వెర్షన్ తీయడంలో వర్మ తన స్టయిల్ ఆఫ్ మేకింగ్ ను చూపించాడు.

 

 

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అల్లుకున్న కథని ఇంత షార్ట్ స్పాన్ లో ఓ కథ రాసుకోవడం, బాబు పాత్రధారికి ట్రైనింగ్ ఇచ్చి ఇంత తక్కువ సమయంలో సినిమా తీయడం రామ్ గోపాల్ వర్మలో ఉన్న టాలెంట్ కు నిదర్శనం. సినిమా ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే అంశం పక్కనపెడితే ఇలాంటి రాజకీయ వ్యంగ్య చిత్రం సగటు ప్రేక్షకుడికి టైమ్ పాస్ అయిపోతుందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: