తెలుగులో వివాదాస్పద దర్శకుడు వర్మ తెరకెక్కించిన చిత్రం అమ్మరాజ్యం లో కడప బిడ్డలు మొత్తానికి అన్ని గండాలని దాటుకొని ఈరోజు థియేటర్లలో దిగింది..సినిమా టైటిల్ చెప్పినప్పటి నుండి ఇప్పటివరకు సినిమాకు ఎన్నో బ్రేకులు పడ్డాడు అయిన  మొండివాడు వర్మ అని మరోసారి నిరూపించి సినిమా థియేటర్లలోకి దించాడు. రాజకీయ పరిణామాల మద్య తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అడ్డంకులు వచ్చిన వెనకడుగు వేయలేదు..

 


ముందు నుండే ఈ సినిమా నుండి విడుదలయిన   విడుదలయిన పోస్టర్లు, టీజర్లు చేసిన రచ్చ ఒక ఎత్తైతే సినిమా నుండి బయటకొచ్చిన పాటలు మాత్రం పటాకుళ్ల గా పేలాయి.. దీంతో సినిమా రచ్చ లకు తెరలేపింది. అయినా కూడా వర్మ ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు వచ్చాడు.. సెన్సార్ బోర్డు నో చెప్పిన కూడా నా సినిమా నా ఇష్టం అంటూ రివైజినింగ్ కమిటీ నీ ఆశ్రయించాడు. అక్కడ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో సినిమాను విడుదల చేశాడు. 

 

సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు సినిమాపై వస్తున్న సంచలన వార్తలే సినిమాకు హైలెట్ అయ్యాయని చెప్పాలి.. టీడీపీ నేతల రచ్చలు, రాజకీయ ఒత్తిడులు, కే పాల్ కోర్టు నోటీసులు ఇవన్నీ కూడా కనిమాను మరో స్థాయిలో కూర్చోబెట్టింది అని వేరేలా చెప్పనక్కర్లేదు..అంతలా పాపులర్ అయిన ఆవినిమా ఇప్పుడు హిట్ ట్రాక్ లో నడుస్తుంది..

 


అసలు విషయానికొస్తే.. జగన్ ను సపోర్ట్ చేస్తూ వచ్చిన వర్మ మిగితా నాయకులను మాత్రం ఉన్న గేమ్ లు ఆడించడాని అర్థమవుతుంది.. కామెడీ కామెడీ అంటూనే కారం కొట్టాడని జనాలు వర్మపై చలోక్తులు విసురుతున్నారు..అయితే ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది మాత్రం ఒక్కటే బాబు నికు వయసైపోయింది ఇంకా నువ్వు రాజకీయాలకు పనికి రావు అంటూ సినిమాలో జగన్ చెప్పిన డైలాగు వైసీపీ నేతలను ఆకట్టుకుందని చెప్పాలి.. ఇప్పటివరకు చూసుకుంటే సినిమా మాత్రం భారీగా హిట్ అవుతుందని అనిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: