బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాట ఎవరికో కానీ దక్కని ఓ వరం. సినిమా, రాజకీయం, సాహిత్యం.. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా అసమాన్య ప్రతిభ  చూపిన వారిని అలా పిలుస్తారు. అటువంటి అరుదైన వరం దక్కించుకున్న వారిలో గొల్లపూడి మారుతీరావు ఒకరు. తెలుగు సినీ పరిశ్రమ దక్కించుకున్న ఈ సరస్వతీ పుత్రుడు 80 ఏళ్ల వయసులో నేడు పరమపదించారు. ఈ వార్త సినీ పరిశ్రమకు, ప్రేక్షకులకు, సాహితీవేత్తలకు నిజంగా ఓ చేదు వార్త.

 

 

సాహిత్యంతో పాటు నాటక రంగంలో కూడా తన ప్రతిభాపాఠవాలు నిరూపించుకున్న ఆయన అక్కడి నుంచే సినీ రంగంలోకి ప్రవేశించారు. చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ద్వారా ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. కోడి రామకృష్ణ కు ఆయనకు ఆ సినిమానే మొదటి సినిమా. అటుపై ఆయన వెనుతిరిగింది లేదు. తరంగిణి, సంసారం ఓ చదరంగం, ఛాలెంజ్.. ఇలా దాదాపు 230 సినిమాల్లో నటించారు.. రచయితగా కూడా పనిచేశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, సంసారం ఓ చదరంగంతోపాటు చాలా సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను కూడా ఆయన అందుకున్నారు. ఆంధ్రప్రభకు పత్రికా సంపడకుడిగా, కడప రేడియో కేంద్రంలో కూడా పని చేశారు.

 

 

గొల్లపూడి తనయుడు శ్రీనివాస్ మరణం ఆయనను తీవ్రంగా కలచివేసింది. 1992లో అప్పట్లో కొత్త ఇప్పుడు తమిళ స్టార్ హీరో అజిత్ ను పెట్టి ప్రేమ పుస్తకం అనే సినిమా తీస్తున్నారు. విశాఖపట్నం బీచ్ లో షూటింగ్ జరుగుతూండగా ప్రమాదవశాత్తు ఆయన మరణించారు. దాంతో ఆ సినిమాను గొల్లపూడి పూర్తి చేశారు. అప్పటినుంచి గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ జాతీయ అవార్డు పేరిట ప్రతి ఏటా కొత్త దర్శకుడికి ఈ అవార్డును అందిస్తున్నారు. కెరీర్లో ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన గొల్లపూడికి ఈ విషయం పీడకలలా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: