వివాదాస్పద దర్శకుడిగా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొందరు ఈ సినిమా టైటిల్ అభ్యంతరకరంగా ఉందని, కావున దానిని మార్చాలని హై కోర్ట్ ని ఇటీవల ఆశ్రయించి ఒక పిల్ వేయడం జరిగింది. కాగా చివరకు సినిమా టైటిల్ మార్చమని హై కోర్ట్ కూడా ఆర్డర్ ఇవ్వడంతో, మూడు రోజుల క్రితం ఈ సినిమా టైటిల్ ని మార్చారు రామ్ గోపాల్ వర్మ. 

 

ఇక మధ్యలో ఇంకొందరు అయితే, ఇది ముఖ్యమైన సామజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టేది గా ఉందని పలు విధాలుగా వాదించారు. అయితే వాటన్నిటినీ ఎదిరించి నేడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన వర్మ, ఓవర్ ఆల్ గా సినిమాకు బాగానే రెస్పాన్స్ వస్తుందని తన ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో దాదాపుగా అందరు రాజకీయ నాయకులపై సెటైర్లు వేసిన వర్మ, చంద్రబాబు మరియు లోకేష్ లను ఒక ఆట ఆడుకున్నాడని అంటున్నారు ప్రేక్షకులు. ఇక సినిమాలో తన రేంజ్ సెటైర్లతో ప్రేక్షకులను అలరించిన వర్మ, చివరిగా క్లైమాక్స్ లో ప్రత్యక్షం అయ్యారు. టివి9 యాంకర్ జాఫర్, వర్మను ఇంటర్వ్యూ చేస్తున్న సీన్ క్లైమాక్స్ లో వష్తుందట. కాగా ఆ సీన్ లో వర్మ మాట్లాడుతూ, 

 

ఆంధ్రప్రదేశ్ లోని మెజారిటీ ప్రజలు, ఇటీవల ఎన్నికల్లో ఏకంగా 151 అసెంబ్లీ సీట్లను వైసిపికి  అందించారంటే, ఆ పార్టీపై మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంపై వారికి ఎంత నమ్మకం ఉందొ అర్ధం చేసుకోవచ్చని వర్మ అన్నారు. ఇక సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి తనవంతుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్తున్న జగన్ గారు నిజమైన దమ్మున్న నాయకుడని వర్మ తన మనసులోని మాటను బయట పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్ గారు చాలావరకు ప్రజల మెప్పు పొందుతున్నారని, కావున వర్మ కూడా ఉన్న వాస్తవాన్ని చెప్పారని పలువురు ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి మున్ముందు ఈ సినిమా ఎంతమేర కలెక్షన్ ని రాబడుతుందో చూడాలి......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: