సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఎన్నో అవరోధాలను దాటుకుని గురువారం థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు రిలీజ్ కు కొన్ని గంటల ముందే బుధవారం రాత్రి సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ వచ్చింది. కొన్నిచోట్ల బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రదర్శించారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఏపీ, తెలంగాణ‌లోని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు ఇక ఈ సినిమా కథ‌ చూస్తే ఆర్జీవీ చెప్పిన దాని ప్రకారం ఇదొక కల్పిత కథ.

 

అయితే ఇది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే.. రూలింగ్ పార్టీ అయిన వెలుగు దేశం పార్టీని గద్దె దింపి అత్యధిక మెజారిటీతో విఎస్ జగన్నాథరెడ్డి(అజ్మల్ అమీర్) పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ తక్కువ రోజుల్లోనే విఎస్ జగన్నాథరెడ్డి పార్టీ నాయకుల ఫ్యాక్షనిజం వల్ల సీఎం జ‌గ‌న్నాథ్ రెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఇదే టైంలో గ‌త ముఖ్య‌మంత్రి అయిన వెలుగు దేశం పార్టీకి చెందిన బాబుకు స‌న్నిహితుడు అయిన దైనేని ర‌మ‌ను విజయవాడ మెయిన్ రోడ్ లో మర్డర్ చేస్తారు.

 

ఈ మ‌ర్డ‌ర్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం చిక్కుల్లో ప‌డుతుంది. చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి వీఎస్‌. జ‌గ‌న్నాథ్ రెడ్డి త‌న ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తారు. అప్పుడు మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌స్తాయి. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో ఏపీలోని మొత్తం 175 సీట్ల‌కు గాను అధికార పార్టీకి ఏకంగా 174 సీట్లు వ‌స్తాయి. ప్ర‌తిప‌క్ష పార్టీ కేవ‌లం ఒక్క సీటుకే ప‌రిమిత‌మ‌వుతుంది. ఇక మ‌న‌సేన పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. సో ఇప్పుడు ఏపీలో జ‌మిలీ ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ఆశ‌లు పెట్టుకున్న చాలా మంది నేత‌ల‌కు చాలా ఆశ‌లే ఉన్నాయి. సో వ‌ర్మ చెప్పిన దానిని బ‌ట్టి చూస్తే ఏపీ ప్ర‌జ‌ల్లో ఇంకా జ‌గ‌న్ పై వ్య‌తిరేక‌త లేద‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది. అయితే ఇక్క‌డ మ‌న రాజ‌కీయ  నేత‌ల ఆశ‌లు మాత్రం వేరేలా ఉన్నాయి. వాళ్లంతా ఇప్ప‌టి నుంచే క‌ల‌ల్లో విహ‌రిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: