టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు యూత్ కి ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఒకే ఒక్క సినిమాతో సినీప్రియుల దృష్టినే తనవైపు తిప్పుకునేలా చేసిన నటుడు విజయ్‌ దేవరకొండ. సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ మొదట బోల్డ్ కంటెంట్... బూతు డైలాగ్స్ అని విమర్శలు వచ్చాయి.  కానీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆ అభిప్రాయం మార్చుకున్నారు  ప్రేక్షకులు.. ఓ అందమైన లవ్ స్టోరీ గుండెలకు హత్తుకునేలా తీశారని విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.  కేవలం మౌత్ టాక్ తోనే ఈ మూవీ భారీ హిట్ కొట్టడమే కాదు.. ఏమాత్రం స్టార్ డమ్ లేని హీరో అయిన విజయ్ దేవరకొండ ని సెన్సేషన్ హీరోగా మార్చింది.  పాత తరం నుంచి నేటి తరం వరకు ఏదో ఒక హీరో ట్రెండ్ సెట్ చేస్తుంటారు..ఈ తరం యువ హీరోల్లో విజయ్ దేవరకొండ అలాంటి ట్రెండే సృష్టించాడు.

 

గూగుల్‌ జాబితాలో  స్టార్ హీరోలను పక్కకు నెట్టి దూసుకు వెళ్లాడు. విచిత్రం ఏంటంటే.. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో నటించకున్నా అక్కడ అప్ కమింగ్ హీరోయిన్లు మనోడితో నటించాలని తెగ ఉత్సాహ పడుతున్నారంటే ఈ కుర్ర హీరో క్రేజ్ ఎలాంటిదో చూడొచ్చు.   తాజాగా ఈ విజయ్ దేవరకొండ తన క్రేజ్‌తో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. గూగుల్‌లో 2019లో అత్యధిక మంది వెతికిన సినీతారల జాబితాను విడుదల చేయగా.. ఈ జాబితాలో దక్షిణాదిలోనే టాప్‌ స్టార్‌గా నిలిచారు దేవరకొండ. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి పెద్దగా హిట్ సినిమాలేవీ లేవు.  రష్మిక మందనతో నటించిన ‘డీయర్ కామ్రేడ్’ మూవీ అనుకున్న సక్సెస్ సాధించలేదు.

 

2018లో ఆయన ‘మహానటి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకోగా.. ఈ ఏడాది మాత్రం భారీ అంచనాలతో తీసుకొచ్చిన ‘డియర్‌ కామ్రేడ్‌’ నిరాశపరిచింది. ఈ ఏడాది  గూగుల్‌ జాబితాలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అజిత్‌, ప్రభాస్‌, విజయ్‌ వంటి క్రేజీ స్టార్లను సైతం వెనక్కు నెట్టాడు ఈ సెన్సేషన్ హీరో.  ప్రస్తుతం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ మూవీలో నటిస్తున్న విజయ్ దేవరకొండ.. త్వరలో పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న  ‘ఫైటర్‌’ అనే పాన్‌ ఇండియా మూవీలో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: