గొల్లపూడి ఎప్పుడూ సినీ రచయిత అవ్వాలని అనుకోలేదట. అంతేకాదు సినిమా నటుడు కావాలనుకోలేదట. ఇవన్నీ తప్పసరి పరిస్థితుల్లో అలా జరిగిపోయాయని కొన్ని సందర్భాలలో తెలీఅరు. ఆయన 42 వ ఏట నటుడయినప్పటికి ఈ వయసులో సినిమా ఎందుకయ్యా.. పోవయ్యా!! అని ఆయనకి ఆయనే అనుకునేవారు. గొల్లపూడి స్టేజ్ మీద నటించినప్పటికి.. ఆయన దృష్టి నటన వైపు ఉండేది కాదట. 42వ ఏట సినిమాల్లో నటించడం మొదలుపెడితే.. 35 ఏళ్ల పాటు నిర్విరామంగా 280కి పైగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. అయితే ఇది ఆయనే ఊహించనిది. అయితే చాలా మంది మీరు మంచి నటుడే కాదు.. మంచి రచనలు కూడా చేస్తారట కదా అనేసరికి... నవ్వుకుని.. నేను రచనలే చేస్తుంటా.. అప్పుడప్పుడూ నటిస్తా అని చాలామందికి చెప్పారట.

 

గొల్లపూడి రచయితగా.. నటుడుగా.. ఉద్యోగస్తుడిగా.. ఇలా చాలా వృత్తులు చేసినప్పటికీ డబ్బుపై మాత్రం ఆశ అతిగా ఆశ ఉండేది కాదట. ఆ మాటకు వస్తే అసలు డబ్బే ముఖ్యం కాదు అనుకునేవారు. అంతేకాదు గొల్లపూడికి 100 రూపాయిల జీతం ఉన్నప్పుడు నూట పాతిక రూపాయిలు వచ్చేవి.. ఎలా అంటే నేను కథలు రాసేవారు కాబట్టి. ఇలా వెయ్యి రూపాయిల జీతం ఉంటే పదివేలు కథలు, నాటకాల ద్వారా వచ్చేవట. ఎప్పుడు ఆయన డబ్బుకు వెతుక్కోవలసిన అవసరం రాలేదట. అంతేకాదు ఆయన జీవితంలో డబ్బు అనేది సమస్య ఎప్పుడూ కానేకాలేదు. అందుకే డబ్బు కోసం మనసు చంపుకొని చేయల్సిన పనులు ఎప్పుడు చేయలేదట.

 

ఇక గొల్లపూడి కెరియర్ ప్రారంభంలో రూ. 10 వచ్చేవట. 1959-61లో రూ. 10 కోసం కూడా కథలు రాశారట. నాకు డబ్బు ముఖ్యం కాదు. ఏదీ మన చేతుల్లో ఉండదు. రచయిత, నటన, కథనం, కథ ఇలా ఏదీ నేను అనుకుని చేసింది కాదు...అంటు చెప్పేవారు. దీన్ని బట్టి చూస్తే ఆయనకి వచ్చిన మొదటి సంపాదనతో ఇప్పుడు ఒక మంచి హోటల్ లో టీ కూడా రాదని అర్థమవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: