రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె.ఎస్ రవికుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా, కేథరిన్ త్రెసాలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుండి మొన్నామధ్య వచ్చిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది.

 

ఇక లేటెస్ట్ గా సినిమా నుండి ఫస్ట్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పోస్టర్ వదిలారు. విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్ ఇద్దరు మంచి రొమాంటిక్ హగ్ తో ఉన్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తే విజయ్, ఐశ్వర్య రాజేష్ భార్యా భర్తలుగా నటిస్తున్నారని తెలుస్తుంది. వంటగదిలో కూరగాయలు కట్ చేస్తున్న హీరోయిన్ తో విజయ్ రొమాంటిక్ మూడ్ లో ఉన్న పిక్ ప్రేక్షకులను అలరించింది. 

 

ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ తో పాటుగా రాశి ఖన్నా, కేథరిన్ త్రెసా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా టైటిల్ ను బట్టి చూస్తే రెండు మూడుసార్లు లవ్ ఫెయిల్ అయిన కుర్రాడి కథే అనిపిస్తుంది. ఈ సినిమాకు రాం చరణ్ ఆరెంజ్ సినిమాకు పోలిక ఉందని ఈమధ్య వార్తలు వచ్చాయి. తనకు లైఫ్ లాంగ్ ప్రేమించే లవ్ కావాలని రాం చరణ్ చేసిన ఆరెంజ్ సినిమా అప్పట్లో పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

 

బొమ్మరిల్లు భాస్కర్ అప్పట్లోనే ఈ షార్ట్ టర్మ్ లవ్ ఒకటి వస్తుందని గుర్తించాడు. కాని అప్పట్లో ఆరెంజ్ సినిమాను ఎవరు చూడలేదు. కాని ఇప్పుడున్న ఆడియెన్స్ కు ముఖ్యంగా యూత్ కు వరల్డ్ ఫేమస్ లవర్ కచ్చితంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో విజయ్ మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. డియర్ కామ్రేడ్ భారీ అంచనాలతో వచ్చినా వర్క్ అవుట్ కాలేదు. మరి వరల్డ్ ఫేమస్ లవర్ అయినా మెప్పిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: