ఎన్నో ఆశలు మధ్య ఈ రోజు విడుదల అవుతున్న వెంకీ మామ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు అని తెలుస్తుంది. తొలి సారిగా విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ ఈరోజు విడుదల అవుతుంది. కానీ ఈ సినిమాకి సంబంధించిన యూస్  ప్రీమియర్స్ నిన్ను రాత్రి మొదలయ్యాయి. ఇప్పుడు ఆ చిత్రానికి సంబంధించిన సినిమా రిపోర్ట్ లు వస్తున్నాయి చాలా మంది క్రిటిక్స్ ఈ సినిమా అంత గొప్పగా ఏమీ లేదని చెప్తున్నారు.

 

 ఒక రొటీన్ స్టోరీ తీసుకున్న చిత్ర దర్శకుడు దాన్ని తెరకెక్కించే విషయంలో అంత జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించట్లేదు. సినిమా మొదటి అర్ధ భాగంలో వెంకటేష్ కామెడీ టైమింగ్ చాలా బాగా ఉంది అని. అలాగే ఇంటర్వెల్ సీన్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆ సీన్ ని చాలా బాగా ఎలివేట్ చేసినట్టు తెలుస్తోంది.


ఇక ఈ సినిమా రెండవ అర్ధ భాగంలో తొలి 20 నిమిషాలు బాగా ఉన్న ఆ తర్వాత వచ్చే ఆర్మీ సీన్స్ అంతగా బాగో లేవు అని తెలుస్తున్నాయి. ఈ సన్నివేశాలను కొద్దిగా ఎక్కువగా చూపించారని అర్థం అవుతున్నాయి.

 

 చాలా రోజుల తర్వాత తెలుగులో మల్టీస్టారర్ సినిమా వస్తుంది. అది కాక నిజ జీవితంలో మామ అల్లుళ్ళ అయిన ఇద్దరు హీరోలు తెరపై కూడా అదే క్యారెక్టర్లో కనిపించడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా తొలిసారి రాశిఖన్నా నటించింది, అలాగే వెంకటేష్ సరసన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కనిపించారు.ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్ నిర్మించింది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించాడు. అలాగే ఈ రోజు దగ్గుబాటి వెంకటేష్ జన్మదినం కూడా కావడం ఒక విశేషం.ఈ సినిమా బిజినెస్ దాదాపు 32 కోట్లుకి జరిగినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: