టాలీవుడ్ మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగిస్తున్న మన విక్టరీ వెంకటేష్ మరో క్రేజీ మల్టీస్టారర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకటేష్, నాగ చైతన్య కలిసి చేసి మల్టీస్టారర్ మూవీ వెంకీమామ. కె.ఎస్ రవింద్ర బాబి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీగా రిలీజైంది. ఇక ఈ సినిమా షోలు ఇప్పటికే మొదలయ్యాయి.

 

కొన్నిచోట్ల ప్రీమియర్ షోస్ పడగా సినిమా టాక్ బయటకు వచ్చేసింది. వెంకీమామ సినిమాలో వెంకటేష్ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడని అంటున్నారు. ఎప్పటిలానే తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో వెంకటేష్ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చేసినట్టు చెప్పుకుంటున్నారు. వింటేజ్ వెంకీ మళ్లీ ఈ సినిమాతో అలరిస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ అనీల్ రావిపుడి ఎఫ్-2తో ఫాం లోకి వచ్చిన వెంకటేష్ ఈ సినిమాతో తన హవా కొనసాగించాడని చెప్పొచ్చు.

 

వెంకట రత్నం పాత్రలో వెంకీ అదరగొట్టాడట. సినిమాలో మరో హీరో నాగ చైతన్య ఉన్నా సరే వెంకటేష్ మీదే ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. మామా అల్లుళ్లుగా ఆన్ స్క్రీన్ కూడా వెంకీ, చైతు కెమిస్ట్రీ అదిరిపోయిందని అంటున్నారు. ఇక వెంకీకి జోడీగా నటించిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కూడా తన అందచందాలతో మెప్పించిందని టాక్. ముఖ్యంగా ఓ సాంగ్ లో పాయల్ పూర్తి న్యాయం చేసినట్టు చెప్పుకుంటున్నారు.

 

వెంకీమామతో వెంకటేష్ మళ్లీ తన సత్తా చాటాడు. కొన్నాళ్లుగా రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేసి ప్రయోగాలంటూ కెరియర్ లో వెనుకపడ్డ వెంకీ తన మార్క్ సినిమాలతో అలరిస్తున్నాడు. ఎఫ్-2, వెంకీమామ బ్యాక్ టూ బ్యాక్ వెంకీ సర్ ప్రైజ్ సినిమాలతో తన ఫ్యాన్స్ ను విశేషంగా అలరిస్తున్నాడు. వెంకీమామ సినిమా వెంకటేష్ కోసం అయినా ఒకసారి చూసేయొచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: