విక్ట‌రీ వెంక‌టేష్ - అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్లో ఇంట్ర‌స్టింగ్ మ‌ల్టీస్టార‌ర్ గా తెర‌కెక్కిన సినిమా వెంకీ మామ‌. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే వీరిద్దరి నిజ జీవితంలో ఉన్న ఎమోషన్ ఆన్ స్క్రీన్ మీద ఆవిష్కరించబోతున్నారు అన్న ఆలోచన ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదిలో మెదిలింది. ఇక థియేటర్లో మామ అల్లుడుగా వెంకీ - చైతు నటన బాగుంది. వీరిద్దరి మధ్య వచ్చిన కొన్ని కామెడీ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్లు వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా మామ – అల్లుడు కాంబినేషన్ లో వచ్చే లవ్ స్టోరీ సీన్స్ బాగానే నవ్విస్తాయి.

 

అలాగే ఇద్దరికీ ఇచ్చిన కొన్ని ఎలివేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్ మాత్రం ఆడియన్స్ కి రోమాలు నిక్కబొడుచుకునే హై ఫీలింగ్ ని కలిగిస్తుంది. ఇక సెకండాఫ్ లో అక్కడక్కడా ట్విస్టులు బాగున్నాయి. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ కు ఇంత వ‌య‌స్సు వ‌చ్చినా త‌న‌లోని ఈజ్ ఎక్క‌డా త‌గ్గ‌లేద‌ని మ‌రోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక వింటేజ్ మార్క్ కామెడీ మరోసారి ప్రేక్షకులకి ఇవ్వడంలో వెంకటేష్ సక్సెస్ అయ్యాడు.

 

ఇక నాగ చైత‌న్య లుక్ ప‌రంగా చాలా జోష్ తో ఈ క్యారెక్ట‌ర్ చేశాడ‌ని మ‌న‌కు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక ఇద్ద‌రు హీరోలు - ఇద్ద‌రు హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ సీన్లు, రోమాంటిక్ ట్రాక్ కూడా బాగుంది. ఫ‌స్టాఫ్ అంతా కామెడీ, ల‌వ్ సీన్ల‌తో న‌డుస్తుంది. మ‌ధ్య‌లో వ‌చ్చే యాక్ష‌న్ సీన్లు కూడా మెప్పించాయి. ఇక హైపర్ ఆది కొన్ని పంచ్ లు బాగానే పేలాయి. వెంకటేష్రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ట్రాక్ మనకు కొన్ని నవ్వుల్ని పంచుతుంది. ఇక హీరోయిన్స్ రాశీ ఖన్నా – రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ లు ఉన్నంతలో బాగా చేశారు. ఇద్దరి గ్లామర్ కూడా బి, సి సెంటర్ ఆడియన్స్ కి అట్రాక్షన్ గా అనిపిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: