విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ వెంకీమామ. ఈ సినిమాతో మరోసారి వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో అలరించారని తెలుస్తుంది. ఎఫ్-2 తో వెంకటేష్ మునుపటి ఫాం లోకి రాగా ఇప్పుడు వెంకీమమా సినిమాతో మరోసారి వింటేజ్ వెంకటేష్ అలరించాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో వెంకీమామ చేసిన ఎంటర్టైన్మెంట్ అదిరిపోయిందని అంటున్నారు.

 

ఈ సినిమాలో జబర్దస్త్ చమ్మక్ చంద్రకు మంచి బ్రేక్ వచ్చినట్టే అంటున్నారు. ముఖ్యంగా చమ్మక్ చంద్ర పంచులతో థియేటర్ మొత్తం నవ్వులే నవ్వులట. వెంకటేష్, నాగ చైతన్యలతో చమ్మక చంద్ర అదిరిపోయే కామెడీ చేశాడని తెలుస్తుంది. వెంకటేష్ మారుతి డైరక్షన్ లో వచ్చిన బాబు బంగారం సినిమాలో కూడా చమ్మక్ చంద్ర ఓ సాంగ్ లో కూడా కనిపించాడు. జబర్దస్త్ లో ఫ్యామిలీ లొసుగులతో కామెడీ చేసే చమ్మక్ చంద్ర అదపాదడపా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

 

ఇక తనకు వచ్చిన ఈ ఛాన్స్ నూటికి నూరు శాతం యూజ్ చేసుకున్నాడు చమ్మక్ చంద్ర. సినిమాలో వెంకటేష్ తో పాటుగా చమ్మక్ చంద్ర చేసే కామెడీ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుంది. డైరక్టర్ బాబి చమ్మక్ చంద్రను బాగా వాడుకున్నాడని చెప్పొచ్చు. ఈ సినిమాతో చమ్మక్ చంద్ర మరిన్ని అవకాశాలు తెచ్చుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.

 

వెంకీ మామ సినిమా విషాయానికొస్తె ఫస్ట్ హాఫ్ కామెడీ ఎంటర్టైనింగ్ మోడ్ లో నడిపించగా సెకండ్ హాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ సినిమాకు సూట్ అవలేదని టాక్. అయితే అసలు రిజల్ట్ ఏంటన్నది ఆడియెన్స్ చెబితేనే తెలుస్తుంది. ఈ సినిమాపై వెంకటేష్ తో పాటుగా నాగ చైతన్య కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుట్ లు హీరోయిన్ గా నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: