విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి చేసిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ వెంకీమామ. ఈ సినిమాను బాబి డైరెక్ట్ చేయగా సురేష్ ప్రొడక్షన్స్ లో సురేష్ బాబు ఈ సినిమా నిర్మించారు. ఈమధ్య కాలంలో సురేష్ బాబు నిర్మించిన భారీ బడ్జెట్ మూవీ ఇదే అని చెప్పొచ్చు. కొన్నాళ్లుగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ వస్తున్న సురేష్ బాబు వెంకీమామ మీద ఇన్వెస్ట్ చేశారు.

 

సినిమా కథ, కథనాలు అంత గొప్పగా ఏం లేవన్నది ఫస్ట్ షో నుండి వస్తున్న టాక్. అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం వెంకటేష్ కామెడీ టైమింగ్ తో అలరించాడట. సెకండ్ హాఫ్ మాత్రం అంచనాలకు తగినట్టుగా లేదని టాక్. సినిమా సెకండ్ హాఫ్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ అసలు మ్యాచ్ అవలేదని అంటున్నారు. సినిమా ఎంటర్టైనింగ్ లో సాగించాలని అనుకున్న డైరక్టర్ సెకండ్ హాఫ్ మొత్తం సీరియస్ గా నడిపించడం మైనస్ అయ్యింది.

 

డైరక్టర్ బాబి ఎందుకు ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యాడని అందరు అనుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ కామెడీతో అలరించి సెకండ్ హాఫ్ సీరియస్ గా నడిపించే అవకాశం ఉంది. కాని దానికి ఓ పర్ఫెక్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఉంటే వర్క్ అవుట్ అవుతుంది. కాని వెంకీమామ విషయంలో అది జరుగలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత కనిపించకుండా వెళ్లిన బాబిని జై లవ కుశ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కించాడు తారక్.

 

సినిమా హిట్ అవడంతో వెంకీమామ సెట్స్ మీదకు వెళ్లింది. దగ్గుబాటి, అక్కినేని కాంబో అనగానే మాములుగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఆశించిన స్థాయిలో సినిమా లేదన్నది ప్రీమియర్స్ నుండి వస్తున్న టాక్. కేవలం వెంకటేష్ కామెడీ కోసమే సినిమా ఓసారి చూడొచ్చని అంటున్నారు. మరి సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో సాయంత్రానికి తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: