టాలీవుడ్ లో సెన్సేషన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.  సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ మూవీతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఈ మూవీ బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా రిమేక్ అయి విజయం సాధించాయి. అర్జున్ రెడ్డి మూవీ హిట్ తర్వాత విజయ్ దేవరకొండకు వరుస ఛాన్సులు వస్తున్నాయి.  ఓ వైపు సినిమాలు, యాడ్స్ తో బిజీగా మారాడు ఈ యంగ్ సెన్సేషన్ హీరో.  తాజాగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న సినిమాని విడుదల చేయనున్నారు. చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ వర్క్ ని మొదలు పెట్టింది.

 

ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని బయటకు వదిలిన చిత్రబృందం తాజాగా మరో పోస్టర్ ని  విడుదల చేసింది. నాలుగు రోజుల్లో వరుసగా నాలుగు పోస్టర్లు వదలనున్నట్లు వివరాలు తెలిపారు.  ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌లుగురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. డిసెంబ‌ర్ 12న ఐశ్వర్యా రాజేష్‌, 13న ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖ‌న్నాల‌కు సంబంధించిన లుక్‌లు విడుదల చేస్తున్నారు. ఈ నాలుగు లుక్స్ సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేస్తామన్నారు. అందులో భాగంగా ఈరోజు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

 

తాజాగా నా పేరు సువర్ణ.. ఆయన పేరు శీనయ్య.. మా ఆయనే 'వరల్డ్ ఫేమస్ లవర్'.. మా శీనయ్యను ప్రేమికుల రోజున కలుద్ధాం..  అంటూ శీనయ్యతో రొమాన్స్ చేస్తున్న సువర్ణ 'వరల్డ్ ఫేమస్ లవర్' పోస్టర్‌ను వదిలింది.  ఈ సినిమాను కె.ఎస్‌.రామారావు స‌మర్పణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్లభ నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ ఈ మూవీ సంగీతం అందిస్తున్నారు. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్రవ‌రి 14న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: