ఆర్ఎక్స్ 100 తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. పంజాబి నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ఇక్కడ రచ్చ రచ్చ చేసింది. అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. కేవలం పాయల్ అందాలే ఆర్ఎక్స్ 100 రేంజ్ పెంచేసాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ తర్వాత పాయల్ ఆర్డీఎక్స్ 100 సినిమాలోనూ అదే బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది.
వరుసగా బోల్డ్ క్యారెక్టర్లతో సినిమాలు చేసుకుంటూ పోవడంతో ఆమెపై బోల్డ్ హీరోయిన్ అన్న ముద్ర పడిపోయింది. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా సినిమాలో నటిస్తోంది. విఐ ఆనంద్ దర్శకుడు. ఇక అంత హాట్ ఇమేజ్ ఉన్న పాయల్‌ను దర్శకుడు బాబి వెంకీ మామ సినిమాలో వెంకీ పక్కన పెట్టాడు. అసలు వెంకీ మామ సినిమా కోసమే ఏకంగా రెండు సంవత్సరాల టైం తీసుకున్న దర్శకుడు బాబీ.. వెంకీ పక్కన హీరోయిన్ గా పాయల్ రాజ్‌పుత్ ను సెలెక్ట్ చేయడంలోనే రాంగ్ స్టెప్ వేశాడా ? అనిపిస్తుంది.
వెంకి ఇమేజ్ వేరు... రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇమేజ్ వేరు. వెంకీని థియేటర్లలో చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. వెంకీ సినిమాలు అంటే ప్రత్యేకంగా ఫ్యామిలీల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. అలాంటి సీనియర్ హీరోకు... కంప్లీట్ బోల్డ్ హీరోయిన్ అన్న ముద్ర ఉన్న పాయల్ రాజ్ పుత్ను పెట్టడంకూడా సినిమాకు మైనస్ గా కనిపిస్తోంది.
ఆర్ ఎక్స్ 100. ఆర్డీఎక్స్ 100 సినిమాల్లో ఆమెనూ బోల్డ్ గా చూసిన వాళ్లంతా ఇప్పుడు వెంకీ పక్కన చూసేందుకు ఎంతవరకు ఇష్టపడతారో ? బాబీకే తెలియాలి. అయితే ఇదే విషయంపై విమర్శలు వచ్చినప్పుడు బాబి తన సన్నిహిత వర్గాలతో ఆమెకు బోల్డ్ ఇమేజ్ ముద్ర లేక ముందు తాము వెంకీ మామకు సెలక్ట్ చేశామని చెప్పుకొచ్చాడట.