రెండు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులకు ఎన్నో ఆశలు కల్పించిన‌ మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర (బాబి) దర్శకత్వం వ‌హించారు. ఇప్పటికే చాలా చోట్ల కంప్లీట్ కావడంతో వెంకీమామ ఎలా ? ఉంది అన్నది బయటకు వచ్చేసింది. ఇక సినిమా చూసిన వాళ్లు రెండేళ్లుగా ఇంత నాసిర‌కం సినిమా కోస‌మా ?  మేం వెయిట్ చేస్తోంది అని పెద‌వి విరుస్తున్నారు.

 

వెంకీ మామ సినిమాకి వెంకీచైతన్య కాంబో ఎంత పెద్ద ప్లస్సో, వీరిద్దరి కోసం రాసిన కథ అంత పెద్ద మైనస్. ఇలాంటి కథల్ని మనం గత మూడు తరాలుగా చూస్తూనే ఉన్నాం. ఎప్పుడో 1990వ ద‌శ‌కంలో రాసిన క‌థ‌ను తీసుకు వ‌చ్చి దానికి ఈ త‌రం క‌ల‌రింగ్ ఇచ్చి సినిమా తీశారే త‌ప్పా సినిమాలో ఎంత మాత్రం కొత్త‌ద‌నం... అక‌ట్టుకునే అంశాలు లేవ‌న్న‌దే మేజ‌ర్ కంప్లైంట్‌.

 

అలాగే కథలో ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ది బెస్ట్ అనుకునేది లేదు. క‌థే చాలా పాత‌గా ఉంది అనుకుంటే...  డైరెక్టర్ బాబీ చేసిన ట్రీట్మెంట్ అంతకన్నా ఓల్డ్ గా ఉండడం గమనార్హం. కమర్షియల్ అనే దానికి రియల్ డెఫినిషన్ తెలియకో లేదా మాకు ఇదే వచ్చు. అస‌లు బాబి అంటేనే ఎంత ప‌ర‌మ రొటీన్ క‌థలు తీసుకుని.. దానికి రొటీన్ ట్రీట్మెంట్ ఇస్తాడ‌న్న అప‌వాదు ఉంది. జై ల‌వ‌కుశ సినిమా అయినా ఎన్టీఆర్ న‌ట‌న‌తో పేరు తెచ్చుకుందే త‌ప్పా అందులోనూ బాబి కొత్త‌ద‌నం చూపించ‌లేదు.

 

కథనం మరియు సీన్ ని కొత్తగా చెప్పే విషయంలో ఆడియన్స్ డెవలప్ అయ్యారు అనే విషయాన్ని ఇంకా రియలైజ్ కాకపోవడం వలన ఈ ఓల్డ్ ఫార్మాట్ ఫాలో అయ్యి బాబీ తన చేతులు తానే కాల్చుకున్నాడు. డైరెక్టర్ గా బాబీ ఈ సినిమా విషయంలో సక్సెస్ అయిన ఒకే ఒక్క ఎపిసోడ్ ఇంటర్వల్ బ్లాక్ మాత్రమే. ఏదైనా బాబి మ‌రోసారి తీవ్రంగా డిజప్పాయింట్ చేశాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: