'వెంకీ మామ' సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదల అవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక అదరగొట్టే రీతిలో జరిపిన సినిమా యూనిట్ ఆ వేడుకలో సినిమాలో నటించిన వెంకటేష్ మరియు నాగచైతన్య ఇచ్చిన స్పీచ్ కి సినిమాపై అభిమానులలో మంచి హైప్ పెరిగింది. ఇదిలా ఉండగా సినిమాలో ఎవరు హీరో అన్నదానిపై మొదటి నుండి రకరకాల కామెంట్లు వినబడుతూనే ఉన్నాయి. కాగా ఈ రోజు విడుదలైన సినిమా బట్టి చూస్తే సినిమాలో పెద్దగా నాగచైతన్య పాత్ర గాని మరియు వెంకటేష్ పాత్ర కు గాని డైరెక్టర్ పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వెంకీ మామ సినిమా నీ కామెడీ కమర్షియల్ ఎలిమెంట్స్ ని నమ్ముకుని డైరెక్టర్ సినిమా తీసినట్లు సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. 

 

కాగా సినిమా కి మెయిన్ హైలెట్ వెంకటేష్ కాదని మరియు అదే విధంగా నాగచైతన్య కూడా కాదని స్టోరీ కూడా అంతకంటే కాదని కామెడీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాకి హైలెట్ అని సినిమా చూసిన ఆడియన్స్ టాక్ . ఇదే క్రమంలో నాగచైతన్య కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ సమయంలో ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం కూడా చాలా గమ్మత్తుగా ఉంది.

 

ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి ఇంపార్టెంట్ చాలా తక్కువ ఉంటుందని అంతేకాకుండా ఈ సినిమా అసలు మల్టీస్టారర్ సినిమా కాదని తన పాత్రకు సంబంధించి కేవలం వెంకటేష్ కి కొద్దిగా సపోర్టింగ్ కి ఉంటున్నట్లు ఉంటుందని సమాధానం ఇవ్వడంతో ఇప్పుడు కూడా అదే విధంగా సినిమా విడుదలయ్యాక నాగచైతన్య అన్నట్టుగానే … సినిమాలో నాగచైతన్య పాత్ర సినిమాకి ఒక గెస్ట్ రోల్ పోలిన పాత్ర ఉందని మరియు అదే విధంగా వెంకటేష్ క్యారెక్టర్ డిజైన్ అయితే చాలా యావరేజ్ గా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. మొత్తంమీద వెంకీ మామ సినిమా చూడాలనుకునే వారు కామెడీ కమర్షియల్ ఎలిమెంట్స్ చూడటం కోసం వెళ్లవచ్చని సినిమాలో నాగచైతన్య మరియు వెంకటేష్ అదేవిధంగా స్టొరీ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదని వెంకీ మామ సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: