సంక్రాంతికి వస్తాడు అనుకున్న వెంకీ మామ ముందుగానే వచ్చేశాడు. కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్, ఫైట్స్ అబ్బా అబ్బా అన్ని రుచులు కలిసిన సినిమా ఇది. ఎంతో అద్భుతంగా తీశారు సినిమాను. మామగా విక్టరీ వెంకటేష్ అదరగొట్టగా అల్లుడిగా నాగ చైతన్య ఈ సినిమాలో అదరగొడుతున్నాడు. ఇంకా వెంకీ మామ పక్కన పాయల్ రాజపుత్, అల్లుడు నాగచైతన్య పక్కన రాశి ఖన్నా కథానాయకలాగా నటించారు.      

 

వెంకీ మామ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంతో ఎంటర్టైన్మెంట్ గా ఉందని, అయితే దర్శకుడు బాబీ ఫస్ట్ హాఫ్ ఎంతో అద్భుతంగా తీసినప్పటికీ, సెకండ్ హాఫ్ పై మాత్రం కేర్ తీసుకోలేదని అంటున్నారు. అయితే ఓవర్ ఆల్ గా సినిమా అంత చూస్తే బాగానే ఉందని, చాలా ఏళ్ళ తరువాత వెంకటేష్ ని మంచి రోల్ లో చూశామని కొందరు ప్రేక్షకులు పబ్లిక్ టాక్ లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.               

 

అయితే సినిమాలో సీన్లు మాత్రమే ఉంటె సినిమా పండదు అని సినిమా కూడా ఉండాలి అని అంటున్నారు నెటిజన్లు. సినిమాలో కొన్ని కొన్ని సీన్లు మనసు హత్తు కుంటున్నాయి అని.. అయితే సినిమా అంత చూస్తే యావరేజ్ ఉంది అని.. మల్టి స్టార్స్ తో సినిమా తీసినప్పుడు అన్ని బాగుండేలా చూసుకోవాలని తెలియదా ? ఇలా తీస్తారా కాస్త చూసుకోవచ్చు కదా బాబీ అంటూ నెటిజన్లు కొందరు ఫైర్ కూడా అవుతున్నారు. ఏది ఏమైనా సినిమా ఓవర్ అల్ గా చాల అద్భుతంగా ఉంది.. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎన్నో నెలల తర్వాత మల్టి స్టార్ చిత్రం తేరా మీదకు వచ్చింది. అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో పాటు వెళ్లి అన్ని రుచులను చూసి రండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: