వెంకీ మామ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా చూసిన వాళ్లంద‌రు ఎవ్వ‌రికి తోచిన‌ట్టు వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఇక టోట‌ల్ సినిమాకు వెంకీ - చైతు కాంబినేష‌న్ హైలెట్‌. ఓ స్టార్ హీరో, ఓ యంగ్ హీరో కాంబినేష‌న్ అంటే ఎంత ఆస‌క్తి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. ఇక ఈ రియ‌ల్ మేన‌మామ‌, మేన‌ళ్లుడు రీల్‌పై అవే క్యారెక్ట‌ర్ల‌లో ఎలా ? న‌టించారు ? అన్న ఆస‌క్తి స‌హ‌జంగానే అందిరిలోనూ ఉంది.

 

ఇక వీరిద్ద‌రి న‌ట‌న విష‌యానికి వ‌స్తే విక్టరీ వెంకటేష్ మరోసారి తనలోని ఈజ్ నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. వెంకట రత్నం అనే పాత్రలో వెంకటేష్ తన పాత్రకు తగ్గట్లు… తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. పాయ‌ల్ రాజ్ పుత్‌తో ల‌వ్ ట్రాక్‌, ఎమోష‌న‌ల్ సీన్లు, కామెడీ ట్రాక్‌, క్లైమాక్స్ ఇలా ప్ర‌తి విష‌యంలోనూ మెప్పించాడు.

 

అలాగే మేనల్లుడిగా కనిపించిన నాగచైతన్య కూడా బాగా నటించాడు. అయితే ఈ ఇద్ద‌రి స్క్రీన్ ప్రెజెన్స్ కంపేరిజ‌న్ చేసిన‌ప్పుడు వెంకీ క‌న‌క సినిమాలో లేక‌పోయి ఉంటే ఈ సినిమా మ‌రింత డ‌ల్ అయిపోయేది. ఇప్ప‌టికే పాత క‌థ‌, రొట్ట క‌థ‌నాల‌తో సినిమాకు మంచి టాక్ లేదు. ఇక వెంకీ త‌న క్యారెక్ట‌ర్‌తో చేసిన కామెడీ, పండించిన ఎమోష‌న్లు కూడా క్లిక్ కాక‌పోయి ఉంటే ఈ సినిమాకు ఈ మాత్రం టాక్ కూడా ఉండేది కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

ఇక ద‌ర్శ‌కుడు బాబి వెంకీ కంటే చైతుకే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చినా కూడా దానిని చైతు స‌రిగా వాడుకోలేదు. వెంకీ న‌ట‌న ముందు చైతు కేరెక్ట‌ర్ పూర్తిగా తేలిపోయింది. వెంకటేష్రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ట్రాక్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. చైతుకు ఇచ్చి న మంచి సీన్ల‌లోనూ న‌ట‌నా ప‌రంగా తేలిపోవ‌డంతో ఆ ఎఫెక్ట్ సినిమా రిజ‌ల్ట్‌పై ప‌డింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: