అతనో సూపర్ హిట్ డైరక్టర్ వరుసగా నాలుగు సినిమాలు తీసి హిట్ అందుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేసే అతను ఒకప్పుడు ఓ స్టార్ డైరక్టర్ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేశాడు. ఇంతను పనిచేస్తున్న టైంలోనే ఆ డైరక్టర్ ఓ స్టార్ హీరోతో సినిమా చేశాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఆ టైంలో ఈ హీరో కోసం ఓ కథ అనుకున్నాడట ఆ సహాయక దర్శకుడు. ఆ కథతోనే ఇప్పుడు అతనే డైరక్టర్ గా మారి సినిమా చేస్తున్నాడట.

 

ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా సంక్రానికి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అసిస్టెంట్ డైరక్టర్ కమ్ రైటర్ గా ఉన్న టైంలో చెప్పిన కథను బూజుదులుపి ఇప్పుడు సినిమా చేయడం ఏంటని అంటున్నారు. అప్పుడే ఈ కథ నచ్చినా సరే డైరక్టర్ ఒప్పుకోలేదట. అందుకే ఆ స్టార్ డైరక్టర్ మాటకి గౌరవం ఇచ్చి ఓ సినిమా చేశాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవడం వల్ల ఆ డైరక్టర్ కూడా అడ్రెస్ లేకుండా పోయాడు.  

   

ఇక ఇప్పుడు ఆ రైటర్ ఒక్కొక్క సినిమా చేస్తూ హిట్టు కొట్టుకుంటూ వచ్చి అప్పుడు ఏదైతే మిస్సైన కథనే తెచ్చి ఆ హీరోని ఒప్పించి సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డైరక్టర్ ఎలాగు సక్సెస్ ఫాం లో ఉన్నాడు కాబట్టి ఈ మూవీ కూడా పక్కా హిట్ అనేస్తున్నారు. 

 

మరి బూజుదులిపిన ఈ కథ ఆ స్టార్ కు ఏ రేంజ్ హిట్ ఇస్తుందో చూడాలి. ముందే రాసుకున్న కథ కాబట్టి ఆ స్టార్ తో షూటింగ్ కూడా చాలా త్వరగా జరిగిందని తెలుస్తుంది. మొత్తానికి తెలుగులో స్టార్ ఎప్పుడో అసిస్టెంట్ ఉన్నప్పుడు చెప్పిన దర్శకుడి కథ నచ్చి ఇప్పుడు తీయడం గొప్ప విషయమని చెప్పొచ్చు. ఈ సినిమా ఏంటన్నది మీరు గెస్ చేయడం చాలా ఈజీ.. అందులో అందాల భామ హీరోయిన్ గా నటిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: