టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోల హవా సాగుతుంది.  స్టార్ వారసులు ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, బన్ని, చైతూల తో పాటు మరికొంత మంది స్వయంకృషితో ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతూ వస్తున్న హీరోలు ఉన్నారు.  ఇప్పుడు సీనియర్ హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తున్నారు.  అయితే వీరిందరికి డిఫరెంట్ గా విక్టరీ వెంకటేష్ మాత్రం అప్పుడప్పుడు హీరోగా నటిస్తు ఎక్కువగా మల్టీస్టారర్ మూవీస్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే  సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గోపాల గోపాల, ఎఫ్ 2 లాంటి మల్టీస్టారర్ మూవీస్ వెంకటేష్  నటించారు.  అంతే కాదు ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన మూవీలో తెలుగు రిమేక్ గా నటిస్తున్నారు.  ప్రస్తుతం వెంకటేష్ తన మేనళ్లుడు నాగచైతన్యతో కటిసి నటించిన ‘వెంకిమామ’ రిలీజ్ అయ్యింది.  అన్ని సెంటర్లలో ఈ మూవీకి మిశ్రమ స్పందన వస్తుంది.  

 

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లో ఉన్న వెంకటేష్ మీడియా అడిగిన ప్రశ్నలకు చాలా ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం వస్తున్న మల్టీస్టారర్ మూవీస్ కి మీరే బ్రాండ్ అయినట్లు ఉన్నారని విలేకరుల ప్రశ్నకు.. అంతలేదు ఆ సినిమాలు బాగా ఆడుతున్నాయి.. ఒకవేళ వరుసగా ఫ్లాప్ టాక్ వస్తే వీడి తిక్క బాగా కుదిరింది... ప్రతిసారి మల్టీస్టారర్ మూవీస్ లో నటించడం వల్లే ఫ్లాపులు వస్తున్నాయని అంటారు.  సోలోగా నటిస్తే నటిస్తే ఏమైతుందని మీరే అంటారు.  అయితే మల్టీస్టారర్ మూవీస్ లో మీ నిడివి తక్కువ అయితే ఫీల్ అవరా అన్న ప్రశ్నకు.. లేదు అలా అనుకుంటే అసలు మల్టీస్టారర్ మూవీలే రావు.

 

నేను ఏ సినిమా అయినా నా ప్రాతను ఎలా మెప్పించాలని చూస్తాను.. పాత్ర నిడివి గురించి ఆలోచించను.   సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల లాంటి మూవీస్ చేస్తున్నప్పుడు న పాత్ర ఏంటి అన్నదానికన్నా నేను ఎంత వరకు న్యాయం చేశాను అనే ఆలోచించాను.   నా కెరీర్ లో మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలతో నటించాను.  ఈ తరం స్టార్ హీరోలు ఎన్టీఆర్, నానిలతో కలిసి నటించాలని ఉందని తన మనసులో మాట చెప్పారు. మరి వెంకటేష్ మనసులో కోరిక భవిష్యత్ లో తీరుతుందా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: