నేటి సాయంత్రం విశాఖపట్టణంలో ‘రూలర్’ సినిమా ఆడియో వేడుక జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను నందమూరి బాలకృష్ణ విశాఖ సిటీ అధ్యక్షుడు కె.శంకర్‌, టీడీపీ నగర కార్యదర్శి పట్టాభిరామ్‌, ఆలిండియా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్‌ కన్వీనర్‌ తిలక్‌లు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలోని ఎంజీఎం పార్క్‌లో సాయంత్రం ఐదు గంటలకు ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నటుడు బాలకృష్ణతోపాటు చిత్రబృందం ఈ కార్యక్రమానికి హాజరవుతుందని పేర్కొన్నారు. బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

 

దీనికి సంబంధించి ట్రైలర్‌ కూడా విడుదలైన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. విలేఖరుల సమావేశంలో నేతలు పైడిరాజు, అప్పారావు, పోతన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 105 వ చిత్రం రూలర్. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను చిత్ర బృంధం ఇటీవ‌లె విడుదల చేసింది. అడుగడుగో యాక్షన్ హీరో అరే దేఖో యారో.. అనే పాటను  విడుదల చేశారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నపాత్రల్లో నటించారు. ఈ నెల 20వ తేదీనా సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బీజీగా ఉన్నారు. రామజోగయ్య శాస్త్రి రాసినా ఈ గేయానికి చిరంతన్‌ భట్‌ సంగీతం అందించారు. సాయిచ‌ర‌ణ్ పాటను ఆలపించారు.

 

ఈ లిరికల్ సాంగ్ అచ్చు బాలకృష్ణ మెనరిజం ఈ పాటలో తెలియజేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. బాలకృష్ణకు జైసింహా చిత్రంలో సూపర్ హిట్ అందించిన దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మతగా వ్యవహారిస్తున్నారు. కె.ఎస్‌.రవికుమార్‌, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: