సెన్సేషనల్ స్టార్ హీరో అంటే తెలియని వాళ్ళు లేరేమో ....ఆ హీరోనే విజయ్ దేవరకొండ..అయితే అర్జున్ రెడ్డి సినిమా ద్వారా బాగా ఫేమస్ అయిన విజయ్సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. డియర్ కామ్రేడ్ చిత్రం ఫ్లాప్ అవ్వడం తో ఇప్పుడు వరుస  సినిమాల లో నటిస్తున్నారు.. కథకు  ప్రాధాన్యం ఉన్న లేకుండా సినిమాలు చేస్తున్నారు..


డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌ తో అన్నివ‌ర్గాల‌ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న తాజా చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`. వేలంటెన్స్ డే సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను యూనిక్‌గా ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ భార్య పాత్ర‌ లో న‌టిస్తోన్న ఐశ్వ‌ర్యా రాజేష్‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది.


తాజాగా ఈ చిత్రం నుండి ఇంగ్లీష్ హిరోయిన్ ఇజాబెల్లె లెయితె లుక్‌ను విడుద‌ల చేశారు. ఇజా అనే పాత్ర‌లో న‌టిస్తోన్న ఇజా బెల్లె లెయితె ఫ్రాన్స్‌లో ఉంటుంది. ఫ్రాన్స్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క‌నెక్ష‌న్ ఏంట‌నే కోణంలో ఈ పోస్టర్‌ను వదిలారు. ఐశ్వ‌ర్య రాజేశ్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్న పోస్ట‌ర్‌కు ఇది భిన్న‌మైన పోస్ట‌ర్‌. ఇందులో ఇజాబెల్లె విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను గౌత‌మ్ అని సంబోధిస్తుంది.


సినిమా ప్రేమికుల రోజు విడుదల కాబోతుంది..అయితే ఈ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.. ఈసినిమా తర్వాత ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.. ఫైటర్ అని టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: