నిన్న విడుదలైన ‘వెంకీ మామ’ మూవీ కథను ముగ్గురు రచయితలు రాయడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ఇలాంటి సాదాసీదా కథకు ముగ్గురు రచయితలు అవసరమా అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఈ మూవీకి కోన వెంకట్ స్క్రీన్ ప్లే వ్రాయడంలో దర్శకుడు బాబీకి సహకరిస్తే సీనియర్ రచయిత సత్యానంద్ ఈ కథకు కొన్ని సూచనలు ఇచ్చాడు అన్న కారణంతో ఈ మూవీ టైటిల్ కార్డ్స్ లో కృతజ్ఞతలు తెలియచేసారు.

ఇక ఈమూవీ మూల కథను జనార్ధన మహర్షి అందించాడు అన్న విషయం కూడ టైటిల్ కార్డ్స్ లో వేయడంతో ఇలాంటి పేరు ఉన్న ముగ్గురు రచయితలు కలిసి ఒక సాదాసీదా కథను వ్రాసారా అంటూ ఈమూవీని చూసేవారికి మాత్రమే కాకుండా విమర్శలకు కూడ షాక్ ఇస్తోంది. ఈ మూవీ పై విశ్లేషణలు చేస్తున్న విమర్శకులకు ఈ మూవీని చూసిన వారికి మూడు సినిమాల కథలు గుర్తుకు వస్తాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మహేష్ ‘మురారి’ బాలీవుడ్ మూవీ ‘యూరి’ మణిరత్నం ‘రోజ’ మూవీలతో పాటు ‘ప్రేమంటే ఇదేరా’ మూవీలలోని సీన్స్ అదేవిధంగా ఆ సినిమాలోని పాత్రలు ‘వెంకీ మామ’ సినిమాలో ప్రత్యక్షం కావడంతో ఇన్ని సినిమాల కథలను ఆ సినిమాలోని సన్నివేశాలను కిచిడీగా మార్చి ముగ్గురు పేరున్న రచయితలు ‘వెంకీ మామ’ కోసం కష్టపడ్డారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీకి రిలీజ్ ముందు ఏర్పడిన క్రేజ్ రీత్యా ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్ల వరకు కలక్షన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ మూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ రీత్యా దాదాపు 50 కోట్లకు పైగా బిజినెస్ జరిగిన ఈ మూవీ బయ్యర్లు గట్టెక్కడం కష్టం అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ కలక్షన్స్ అసలు పరిస్థితి ఈ వీకెండ్ తరువాత మాత్రమే తెలుస్తుందని ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయ పడుతున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: