సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ అనే సినిమా రావటం జరిగింది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతకుముందు కొరటాల దర్శకత్వంలో 'భరత్ అనే నేను' అదే స్థాయిలో హిట్టు కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చిన వరుసగా రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టడం తో సదరు రెండు సినిమాల నిర్మాతలకు అదిరిపోయే లాభాలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో అదే స్థాయిలో విజయం సాధించాలని మహేష్ డిసైడ్ అవ్వటం జరిగింది. సినిమాలో ప్రతి సన్నివేశం కోసం చాలా జాగ్రత్తలు మహేష్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

 

ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం ఏకంగా మహేష్ బాబు 40 కోట్ల నుండి 50 కోట్ల మేరకు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు మరియు అదే విధంగా నిర్మాణ భాగస్వామ్యంలో కూడా ఉండటంతో లాభాలు లో కూడా కొంత వాటా తీసుకున్నట్లు...ఇందులో భాగంగా  సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్.. డిజిటల్ రైట్స్.. హిందీ డబ్బింగ్ రైట్స్‌ను తీసుకున్నాడనే టాక్ వినబడుతోంది.

 

ఈ నేపథ్యంలో ‘సరిలేరే నీకెవ్వరు’ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను సన్ టీవీ వారు రూ. 30 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. మరియు అదే విధంగా హిందీ డబ్బింగ్ హక్కుల రూపంలో రూ.15కోట్ల వరకు ముట్టినట్లు సమాచారం. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ లో ఉన్నా ఏ హీరో తీసుకొని రెమ్యునరేషన్ మహేష్ బాబు తీసుకున్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 11 న ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కానుంది 

 

మరింత సమాచారం తెలుసుకోండి: