పవర్ఫుల్ హీరోయిజానికి పెట్టింది పేరు నందమూరి బాలకృష్ణ. ఇక సినిమాల్లో బాలయ్య చెప్పే డైలాగులకు అబ్బో అదో  రేంజిలో క్రేజ్ ఉంటుంది. ఫ్లూటు జింక  ముందు ఊదు సింహం ముందు కాదు... అంటూ బాలయ్య బాబు డైలాగులు చెబుతుంటే థియేటర్లో విజిల్స్ పడాల్సిందే. ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ తన సత్తా చాటుతూనే ఉంటారు. సీనియర్ హీరో అయినప్పటికీ జూనియర్ హీరోలకు కూడా పోటీ ఇస్తూ  దూసుకుపోతున్నారు బాలకృష్ణ. అయితే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం రూలర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 

 

 

 అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే  ఈ సినిమాలో బాలయ్య యువ హీరోలకు సైతం గట్టిగానే పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.  ఇప్పుడు వరకు బాలకృష్ణ ఏ సినిమాలో కనిపించనంత డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా కోసం స్లిమ్ గా  కనిపించడానికి బరువు కూడా తాగడు బాలయ్య బాబు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ తో అభిమానులు అందరూ హోరెత్తిపోయారు . ఇక మరో సారి పక్కా మాస్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బాలకృష్ణ.

 

 

 

 అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో జరిగినుంది.  దీనికోసం అక్కడ ఏర్పాట్లు కూడా  జరిగిపోయాయి. అయితే బాలకృష్ణ సినిమా రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి  నందమూరి అభిమానులు అందరూ ఇప్పటికే రిలీజ్ ఈవెంట్ జరిగితే స్థలానికి చేరుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు  గెటప్ లలో  అదరగొట్టనున్నాడు. మరోసారి ఫుల్ యాక్షన్ చేయడానికి బాలయ్య రూలర్ సినిమా ద్వారా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ కూడా... రూలర్ సినిమాలో బాలయ్య హీరోయుజం బాగా ఎలివేట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే నందమూరి బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్,  వేదికలు హీరోయిన్లుగా నటిస్తుండగా... జయసుధ భూమిక ప్రకాష్ రాజ్ లు  ఈ సినిమాలో కీలక పాత్రల్లో  నటించనున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం విశాఖలో రూలర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా ఇప్పటికే బాలయ్య అభిమానులు అందరూ అక్కడికి చేరుకొని సందడి చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: