నాగచైతన్య మజిలీ హిట్ తర్వాత మంచి హుషారు మీదున్నాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ నటించిన మామా అల్లుళ్ళ చిత్రం " వెంకీ మామా" చిత్రం విడుదల అయింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పాత కథే అయినా కథ చెప్పిన విధానం బాగుందని అంటున్నారు. అయితే అదలా ఉంటే నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడన్న విషయం తెలిసిందే.

 

లవ్ స్టోరీ పేరుతో తెరకెక్కే ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ ప్రాంతానికి చెందిన గ్రామీణ యువకుడిగా కనిపించనున్నాడట. అదీ గాక సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలన్నీ హీరోయిన్ బేస్డ్ గానే ఉంటాయి. కానీ మొదటి సారి శేఖర్ కమ్ముల తన సినిమాని హీరో బేస్డ్ గా తీస్తున్నాడట. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయిన కొన్ని రోజుల్లోనే నాగచైతన్య మరో సినిమా గురించిన అప్డేట్ వచ్చింది.

 

నాగచైతన్య ఇరవైయవ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎవరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుందో తెలిసిపోయింది. దూకుడు, లెజెండ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా  సోలో సినిమాతో తనని తాను నిరూపించుకుని, సారొచ్చారు లాంటి క్లాసిక్ మూవీని తీసి "గీత గోవిందం" సినిమాతో తన గీత మార్చుకున్న దర్శకుడు పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడట.

 

ఈ మేరకు సమాచారాన్ని అధికారికంగా విడుదల చేశారు. మరి ఈ సినిమాలో నాగచైతన్య సరసన నటించే హీరోయిన్ ఎవరనేది వెల్లడించలేదు. పరశురామ్ సెన్సిబుల్ ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట. మరి ఈ సినిమా కూడా ప్రేమ కథే అయ్యుంటుందని అనుకుంటున్నారు. గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్న ఈ మూవీలో నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: